ఆమ్చూర్ పౌడర్.( Amchur Powder ) దీనిని మామిడికాయ పొడి అని కూడా పిలుస్తారు.
ఇదొక సిట్రస్ మసాలా.ఎండిన పండని పచ్చి మామిడికాయల నుండి ఆమ్చూర్ పౌడర్ ను తయారు చేస్తారు.
సూప్‌లు, కూరలు, చట్నీలు, చాట్స్, పచ్చళ్లు, సలాడ్స్ లో సువాసన ఏజెంట్‌గా ఆమ్చూర్ పౌడర్ ను ఉపయోగిస్తారు.అలాగే స్మూతీస్, షేక్స్ మొదలైన వాటిలో నిమ్మకాయకు ప్రత్యామ్నాయంగా ఈ సిట్రస్ మసాలాను వాడుతుంటారు.
వివిధ వ్యాధుల చికిత్స కోసం ఆయుర్వేద వైద్యంలో కూడా ఆమ్చూర్ పౌడర్ ను ఉపయోగించబడుతుంది.
అంతే అనుకుంటే పొరపాటే.
భారతీయ మసాలా దినుసుల్లో ఒకటైన ఆమ్చూర్ పౌడర్ లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లతో( Anti-Oxidants ) పాటు మనకు చాలా అవసరమైన విటమిన్లు మరియు సూక్ష్మ పోషకాలు కూడా నిండి ఉంటాయి.అందువల్ల ఆరోగ్య పరంగా ఆమ్చూర్ పౌడర్ అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.
జీర్ణ సమస్యలను( Digestion Problems ) ఎదుర్కోవడానికి అమ్చూర్ పౌడర్ ఉత్తమంగా సహాయపడుతుంది.రెగ్యులర్ డైట్‌లో ఈ పౌడర్‌ని చేర్చుకోవడం వల్ల ప్రేగు కదలికలు నియంత్రణలో ఉంటాయి.
మలబద్ధకం( Constipation ) సమస్య దూరం అవుతుంది.

జీవక్రియను పెంచడంలో ఆమ్చూర్ పౌడర్ గొప్పగా పని చేస్తుంది.ప్రతి నిత్యం ఏదో ఒక రూపంలో అమ్చూర్ పౌడర్ ను తీసుకుంటే.ఇది మీ శరీరం నుండి కొన్ని అదనపు కిలోలను తగ్గించడంలో ఉత్తమంగా సహాయపడుతుంది.
ఆమ్చూర్ పౌడర్ లో యాంటీ డయాబెటిక్ లక్షణాలు నిండి ఉంటాయి.మధుమేహ వ్యాధి గ్రస్తులకు( Diabetes ) ఈ పొడి ఎంతో ఉపయోకరంగా ఉంటుంది.

అంతేకాకుండా ఆమ్చూర్ పౌడర్‌ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అది యాంటీ మైక్రోబియల్ లక్షణాలను గ్రహించడంలో సహాయపడుతుందని ఒక అధ్యయనం తేల్చింది.బ్యాక్టీరియా, పరాన్నజీవుల వ్యాధుల నివారణ మరియు చికిత్సలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు అత్యంత కీలకంగా వ్యవహరిస్తాయి.కాబట్టి.ఆమ్చూర్ పౌడర్ ను అస్సలు తేలిగ్గా తీసుకోకండి.వీలైనంత వరకు దీనిని మీ రెగ్యులర్ డైట్ లో ఉండేలా చూసుకోండి.