ప్రసవం అనంతరం చాలా మంది మహిళలకు జుట్టు అధికంగా రాలిపోతుంటుంది.కంటి నిండా నిద్ర లేకపోవడం, ఆహారపు అలవాట్లు, పలు రకాల మందుల వాడకం, ఒత్తిడి తదితర అంశాలు జుట్టు రాలడానికి( Hair Fall ) కారణం అవుతుంటాయి.
విపరీతంగా రాలిపోవడం వల్ల జుట్టు పల్చగా( Thin Hair ) మారిపోతుంటుంది.దీంతో మరింత ఒత్తిడికి లోనవుతుంటారు.
కానీ దిగులొద్దు.ఇప్పుడు చెప్పబోయే ఆయిల్ ను వాడటం అలవాటు చేసుకుంటే రెండు మూడు నెలల్లోనే మీ ఊడిన జుట్టు మొత్తం మళ్లీ మొలుస్తుంది.
కురులు ఒత్తుగా మారతాయి.మరి ఇంతకీ ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 10 బాదం పప్పులు( Badam ) వేసుకోవాలి.అలాగే ఐదు రెబ్బలు కరివేపాకు,( Curry Leaves ) ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఐరన్ కడాయి పెట్టుకుని అందులో అర గ్లాసు కొబ్బరి నూనె,( Coconut Oil ) అర గ్లాసు ఆవనూనె వేసుకోవాలి.అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం, వెల్లుల్లి మరియు కరివేపాకు వేసుకుని ఐదు నిమిషాల పాటు ఉడికించాలి.
ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్, అర కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసి మరొక పది నిమిషాల పాటు ఉడికించాలి.

ఆపై స్టవ్ ఆఫ్ చేసుకొని స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాటిల్ లో నింపుకొని స్టోర్ చేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను ( Oil ) తలకు రాసుకోవాలి.
స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఆయిల్ అప్లై చేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ రాసుకున్న మరుసటి రోజు తల స్నానం చేయాలి.ఈ ఆయిల్ జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తుంది.
హెయిర్ ఫాలో ను అడ్డుకుంటుంది.మీ జుట్టు ఎంత పల్చగా ఉన్నా కూడా వారానికి రెండుసార్లు ఈ ఆయిల్ ను రాసుకున్నారంటే క్రమ క్రమంగా మీ జుట్టు ఒత్తుగా మారుతుంది.
ఆరోగ్యంగా తయారవుతుంది.