ఎండాకాలంలో దాదాపు చాలామంది ప్రజలలో చర్మ సమస్యలు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి.సూర్యుడు నుంచి వచ్చే యువీ కిరణాల వల్ల పలు రకాల చర్మ వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అధిక చెమట కారణంగా చర్మంపై చెమట కాయలు రావడం, దద్దుర్లు ఏర్పడడంతో దురద, మంట వంటి సమస్యలు వేధిస్తాయి.ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు రకరకాల సన్ లోషన్స్, కూలింగ్ పౌడర్స్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు.
అయితే వేసవిలో వచ్చే చర్మ సమస్యలను తగ్గించుకోవడానికి హోం రెమిడి కూడా ఎంతో ఉపయోగపడతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.అలోవెరా,తేనె( Aloe vera ) వంటివి వేసవిలో వచ్చే చర్మ సమస్యలను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయి.
అలోవెరా జెల్ శరీరానికి చల్లదనాన్ని అందించడంతో పాటు చర్మంపై ఏర్పడే దద్దుర్లను కూడా నివారిస్తుంది.ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఔషధ గుణాలు శరీరంలోనీ వేడిని కూడా తగ్గిస్తాయి.
అందువల్ల ముఖంపై లేదా చర్మంపై అలోవెరా జెల్ రాయడం వల్ల యువీ కిరణాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
అయితే తేనెలో ఉండే యాంటీ ఇన్ ఫ్లమెంటరీ గుణాలు చర్మాన్ని సన్ బర్న్ మరియు టానింగ్ ల నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి.సన్ బర్న్ వల్ల ఏర్పడే చర్మపు చికాకు తగ్గించడంలో ఆపిల్ వెనిగర్ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.ఎండ వల్ల ఏర్పడే దద్దుర్లు లేదా చికాకు అనిపించిన ప్రాంతంలో కొద్దిగా ఆపిల్ వెనిగర్( Apple Cider Vinegar ) వేసి కాస్త మసాజ్ చేస్తే వాటి నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
ముఖ్యంగా చెప్పాలంటే ఎండాకాలంలో ఎక్కువగా వేధించే చర్మ సమస్యలలో కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడుతూ ఉంటాయి.దీనిని తగ్గించడానికి కీర దోస( Cucumber ) ఎంతో ఉపయోగపడుతుంది.ఎందుకంటే కీరదోసలో ఉండే విటమిన్ ఇ కళ్ళ కింద ఏర్పడే నల్లటి మచ్చలను తగ్గించడంతోపాటు కళ్ళకు చల్లదనాన్ని ఇస్తుంది.ఈ ఎండాకాలంలో చర్మానికి కావాల్సిన పోషకాలను అందించడానికి పెరుగు,మజ్జిగ వంటివి కూడా ఎంతో మేలు చేస్తాయి.