మీరు డయాబెటిస్ బాధితులా? అయితే షుగర్ లెవల్స్ ను ఇలా కంట్రోల్ చేయండి!

ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే డయాబెటిస్ బాధితులుగా మారుతున్నారు.జీవన శైలిలో మార్పులు, శరీరానికి శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, నిద్రను నిర్లక్ష్యం చేయడం, ఊబకాయం తదితర అంశాలు డయాబెటిస్ కు కారణం అవుతుంటాయి.

 Sugar Levels Are Under Control If You Drink This Water! Sugar Levels, Control Su-TeluguStop.com

అయితే కారణం ఏదైనా సరే ఒక్కసారి డయాబెటిస్ కి గురైతే జీవితకాలం మందులు వాడాల్సి ఉంటుంది.బ్లడ్ షుగర్ లవర్స్ ను అదుపులో ఉంచుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి.

అయితే ఇప్పుడు చెప్పబోయే మ్యాజికల్ వాటర్ ను డైట్ లో చేర్చుకుంటే సులభంగా షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు.మరి ఇంతకీ ఆ మ్యాజికల్ వాటర్ ఏంటి.

దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ లవంగాలు వేసి ముప్పై సెకన్ల పాటు వేయించుకోవాలి.ఆ తర్వాత అదే పాన్ లో మూడు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు, మూడు టేబుల్ స్పూన్లు గుమ్మడి గింజలు వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి.

ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న లవంగాలు, గుమ్మడి గింజలు మరియు అవిసె గింజలు వేసుకుని మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ పౌడర్ ను ఒక డబ్బాలో నింపుకుని స్టోర్ చేసుకోవాలి.

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో తయారు చేసి పెట్టుకున్న పొడిని అర టేబుల్ స్పూన్ చొప్పున కలిపి సేవించాలి.

Telugu Controlsugar, Diabetes, Diabetic, Tips, Latest, Sugar Levels-Telugu Healt

ఈ వాటర్ ను ప్రతిరోజు బ్రేక్ ఫాస్ట్ కు గంట ముందు తీసుకోవాలి.డయాబెటిస్ బాధితులు ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.అదే సమయంలో వెయిట్ లాస్ అవుతారు.

మోకాళ్ళ నొప్పులు దూరం అవుతాయి.మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

జ్ఞాపకశక్తి, ఆలోచన శక్తి సైతం రెట్టింపు అవుతాయి.కాబట్టి డయాబెటిస్ బాధితులు తప్పకుండా ఈ వాటర్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube