షోడశ సుగంధ ద్రవ్యాలు అంటే ఏమిటో తెలుసా?

సుగంధ ద్రవ్యాలను మనం వంటకాల్లోనే కాకుండా పూజలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాల్లో వాడుతుంటారు.

అంతే కాకుండా ప్రతి రోజూ వాడే వాడే ఎన్నో కాస్మొటిక్స్ లో కూడా పలు రకాల సుగంధ ద్రవ్యాలను వాడుతుంటాం.

అలాగే పలు రకాల ఆయుర్వేద మందుల్లో కూడా ఈ సుగంధ ద్రవ్యాల మూలికలను వాడుతుంటారు.అయితే మనకు సుగంధ ద్రవ్యాలు పేరు విన్నప్పటికీ అందులో ఉండే చాలా రకాల గురించి మనకు తెలియదు.

అలాగే షోడశ సుగంధ ద్రవ్యాలు అంటే ఏమిటి, అందులో ఏమేం ఉంటాయో కూడా చాలా మందికి తెలియదు.అయితే మనం ఇప్పుడు వాటి గురించి తెలుసు కుందాం.

షోడశ సుగంధ ద్రవ్యాలు అంటే 16 రకాల సుగంధ ద్రవ్యాలు.అయిదే ఇందులో మొదటిది వట్టి వ్రేళ్లు.రెండోది పర్పాటకం.

Advertisement

మూడోది తుంగ ముస్తలు.నాలుగోది పచ్చ కర్పూరం, ఐదోది గవిళాలు.

ఆరోది అగరు చెక్క.ఏడోది యాలకులు.

ఎనిమిదోది వలంగాలు.తొమ్మిదోది తక్కోలాలు.

పదోది జాజికాయ.పదకొండోది జాపత్రి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
These Face Packs Help To Get Smooth Skin Details Face Packs

పన్నెండవది చంగల్వ కోష్టు.పదమూడవది మ్రాని పసుపు.

Advertisement

పద్నాలుగవది వస.పదిహేనవది కర్జూరం.పదహారవది పసుపు.

వీటినే షోడశ సుగంధ ద్రవ్యాలు అంటారు.అయితే వీటిని ఎన్నో రోగాలు తగ్గించేందుకు ఈ షోడశ సుగంధ ద్రవ్యములను వాడతారు.

ఈ సుగంధ ద్రవ్యాలను చాలా సందర్భాల్లో మనం వాడుతూనే ఉంటాం.కానీ వాటి ఉపయోగాలు, అవి వాడితే వచ్చే ప్రయోజనాలు చాలా మందికి తెలియదు.

ఈ షోడశ సుగంధ ద్రవ్యాలను సందర్భాను సారం వాడితే చాలా లాభాలు ఉంటాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతుంటారు.ముఖ్యంగా ఆయుర్వేదంలో ఈ ద్రవ్యాల వాడకం చాలా ఎక్కువ.

పచ్చ కర్పూరం, తక్కోలాలు, జాజి కాయలు, జాపత్రి, పసుపును పూజా సందర్భాల్లో విరివిగా వాడుతుంటారు.పెద్ద పెద్ద యజ్ఞ యాగాదుల్లో వీటిని ఉపయోగిస్తారు.

తాజా వార్తలు