మన రోజువారీ కార్యక్రమాలను చేయటానికి స్టామినా చాలా అవసరం.జీవితంలో ఒత్తిడి ఎక్కువ అయ్యి అలసిన లేదా శక్తి తగ్గినా ఆ ప్రభావం మన పనితీరుపై పడుతుంది.
స్టామినా పెంచుకోవటానికి వ్యాయామాలు ఉన్నా కొన్ని ఆహారాలను తీసుకోవటం ద్వారా దీన్ని అదికమించవచ్చు.ఈ ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి పలితాన్ని పొందవచ్చు.ఇప్పుడు ఆ ఆహారల గురించి తెలుసుకుందాం.
1.చిలకడదుంప
చిలకడదుంప శరీరం మొత్తానికి స్టామినాను మెరుగుపరచటంలో సహాయపడుతుంది.బాడీ బిల్డర్లు ఎక్కువ శక్తి కోసం చిలకడదుంప మీద ఆధారపడతారు.
శరీరం కణాల ప్రోటీన్ చుట్టూ కొవ్వు చేరకుండా సహాయపడే కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది.అందువల్ల క్రమం తప్పకుండా రోజువారీ ఆహారంలో చిలకడదుంపను తీసుకుంటే స్టామినా పెరుగుతుంది.
2.అరటిపండు
అరటిపండు శరీరంలో శక్తి పెరగటానికి చాలా బాగా సహాయపడుతుంది.అరటిపండులో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరంలో ఉపయోగపడే హార్మోన్స్ విడుదలలో సహాయపడతాయి.ఇది మొత్తం శరీరం యొక్క పనితీరును మెరుగుపరుస్తుంది.అందువల్ల వ్యాయామం చేయటానికి ముందు అరటిపండు తింటే మంచిది.
3.కాఫీ
కాఫీలో ఉండే కెఫీన్ శక్తి పెరగటానికి సమర్ధవంతంగా పనిచేస్తుంది.కాఫీ త్రాగటం వలన నాడీ వ్యవస్థ చురుకుగా ఉండటమే కాకుండా మంచి పనితీరు కోసం శరీరంను ఉద్దీపన చేస్తుంది.అందువలన కాఫీ త్రాగితే స్టామినా పెరగటానికి సహాయపడుతుంది.
4.అవకాడో
అవకాడోను రోజువారీ ఆహారంలో తీసుకుంటే చాలా సహాయకారిగా ఉంటుంది.దీనిలో సమృద్దిగా ఉండే యాంటీఆక్సిడెంట్స్ శరీరానికి విశ్రాంతిని ఇస్తాయి.
అలాగే విటమిన్లు మరియు ఖనిజాలు శరీరం యొక్క పనితీరును మెరుగుపరచటంలో సహాయం చేస్తాయి.శరీర స్టామినా పెరగాలంటే రోజువారీ ఆహారంలో అవకడోలను బాగంగా చేసుకోవాలి.
5.గుడ్లు
గుడ్లులో ప్రోటీన్లు మరియు ఇతర అవసరమైన పోషకాలు సమృద్దిగా ఉంటాయి.గుడ్డు శరీరం యొక్క కండరాలను నిర్మించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది.అలాగే శరీరం యొక్క స్టామినాను పెంచటానికి కూడా సహాయపడుతుంది.ప్రతి రోజు ఒక గుడ్డు తింటే మంచి పలితాలను పొందవచ్చు.