వారంలో 2 సార్లు ఈ నూనెను రాసుకుంటే తెల్ల జుట్టుకు దూరంగా ఉండొచ్చు!

తెల్ల జుట్టు.ప్రస్తుత రోజుల్లో కోట్లాది మందికి పెద్ద శత్రువు గా మారింది.తెల్ల జుట్టు వల్ల అందం దెబ్బ తినడమే కాదు.ఇరుగు పొరుగు వారు చేసే హేళనకు ఒత్తిడి పెరిగి మానసిక ప్రశాంతత సైతం దూరం అవుతుంది.ఈ క్రమంలోనే తెల్ల జుట్టును దూరం చేసుకోవడానికి నానా పాట్లు పడుతుంటారు.అయితే తెల్ల జుట్టు వచ్చాక ఇబ్బంది ప‌డ‌టం కంటే రాకముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ఉత్తమమని అంటున్నారు నిపుణులు.

 If You Apply This Oil 2 Times A Week, You Can Avoid White Hair , White Hair, Mag-TeluguStop.com

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే మ్యాజిక‌ల్‌ ఆయిల్ ను వినియోగిస్తే కనుక వయసు పెరిగినా తెల్ల జుట్టుకు దూరంగా ఉండొచ్చు.మరి ఇంకెందుకు లేటు తెల్ల జుట్టుకు చెక్ పెట్టే ఆ మ్యాజికల్ ఆయిల్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండి.

ముందుగా ఒక కప్పు గోరింటాకు ఆకులు సేకరించి నీటిలో శుభ్రంగా కడగాలి.ఇలా కడిగిన గోరింటాకు ఆకులను మిక్సీ జార్ లో వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనెను పోయాలి.ఆయిల్ హిట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న గోరింటాకు, వన్ టేబుల్ స్పూన్ వాము వేసి పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

అనంతరం స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ కంప్లీట్‌గా కూల్ అయిన వెంట‌నే స్ట్రైన‌ర్‌ సహాయంతో సపరేట్ చేసుకోవాలి.

Telugu Avoid White, Black, Care, Care Tips, Oil, Latest, Magical Oil, White-Telu

ఈ ఆయిల్ ను దాదాపు నెల రోజుల పాటు వాడుకోవచ్చు.నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసుకుని కాసేపు మసాజ్ చేసుకోవాలి.మరుసటి రోజు ఉదయం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్‌ చేసుకోవాలి.

వారంలో రెండు సార్లు గనక ఇలా చేస్తే తెల్ల జుట్టుకు దూరంగా ఉండొచ్చు.అదే సమయంలో హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్ వంటి సమస్యలు సైతం అదుపులోకి వ‌స్తాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube