మహేష్ బాబు కెరీర్ ప్రస్తుతం మంచి స్పీడ్ మీద ఉంది.టాలీవుడ్ లో స్టార్ హీరోగా వరుసగా హిట్ లను అందుకుంటూ ప్రేక్షకులలో అంచనాలు పెంచుకుంటూ పోతున్నాడు.
తాజాగా మహేష్ బాబు నుండి వస్తున్న చిత్రం “సర్కారు వారి పాట“.ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక ఈ సినిమా నుండి వస్తున్న ఒక్కొక్క అప్డేట్ అంచనాలను పెంచుకుంటూ పోతున్నాయి.ఈ సినిమాలో మహేష్ బాబు సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా చేస్తోంది.
ఇక వెన్నెల కిషోర్, నదియా, సముద్రఖని కీలక పాత్రలు చేస్తున్నారు.ఇక ఇంత పెద్ద ప్రాజెక్ట్ కు దర్శకుడిగా సోలో మరియు గీత గోవిందం చిత్రాల దర్శకుడు పరుశురాం వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్ కూడా నిన్ననే విడుదలయ్యి మంచి వ్యూస్ తో యు ట్యూబ్ లో రికార్డులను కొల్లగొడుతోంది.అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక కీలక విషయం వైరల్ గా మారింది.
అదేమిటో ఒకసారి చూద్దాం.
మహేష్ బాబు ఈ సినిమాకు ముందు నటించిన సినిమాలలో ఒక కామన్ పాయింట్ దీనికి మ్యాచ్ అవుతోంది.
ఈ సెంటిమెంట్ దీనికి కూడా కలిసి వచ్చి ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి.ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏమిటి అనేది ఒకసారి తెలుసుకుందాం.
మహేష్ హీరోగా కొరటాల శివ తెరకెక్కించిన మూవీ శ్రీమంతుడు.ఈ సినిమా ఒక మంచి సామజిక బాధ్యతతో తెరెకెక్కింది.
ఇందులో హీరోయిన్ గా శృతి హాసన్ నటించి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర పేరు చారుశీల… ఇందులో చారుశీల పేరుతో ఒక సాంగ్ ఉంది.
ఇలా హీరోయిన్ పేరు మీద సాంగ్ వచ్చింది.ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పక్కర్లేదు.
ఆ తర్వాత ఇదే విధంగా మళ్ళీ భరత్ అనే నేను తో కొరటాలతోనే మహేష్ బాబు జత కట్టాడు.ఈ సినిమా కూడా సామజిక బాధ్యతతో వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసింది.
ఇందులో మహేష్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ నటించి ప్రేక్షకులను మెప్పిచింది.ఈ సినిమాలో కియారా పాత్ర పేరు వసుమతి.
సేమ్ ఇంతకు ముందు సినిమాలో లాగానే వసుమతి పేరుతో ఒక పాట ఉంది.
ఇలా రెండు సార్లు వరుసగా హీరోయిన్ పేరు మీద పాట చేయగా రెండూ హిట్ లు అయ్యాయి.ఇప్పుడు మూడవ సారి కూడా అదే సెంటిమెంట్ మహేష్ ఫాలో అవుతున్నాడు.“సర్కారు వారి పాట”లో హీరోయిన్ గా చేస్తున్న కీర్తి సురేష్ పేరు కళావతి.ఇందులో కళావతి అని సాగే పాట ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.సో దీనిని బట్టి చూస్తే మహేష్ ముచ్చటగా మూడోసారి హీరోయిన్ పాటలను పెట్టుకుని హిట్ కొట్టనున్నాడు అని తెలుస్తోంది.
మరి ఈ సెంటిమెంట్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది తెలియాలంటే మే 12 వరకు ఆగాల్సిందే.