తెల్ల జుట్టు తో బాధపడుతున్నారా? వైట్ హెయిర్ ని కవర్ చేసుకునేందుకు తరచూ కలర్స్ పై ఆధారపడుతున్నారా? అయితే కృత్రిమ రంగులు తాత్కాలికంగా జుట్టును నల్లగా మార్చినా.వాటిలో ఉండే రసాయనాలు కురుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.
అందుకే సహజ పద్ధతిలో జుట్టును నల్లగా మార్చుకునేందుకు ప్రయత్నించాలి.ఇప్పుడు చెప్పబోయే రెమెడీ అందుకు చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.
ఈ రెమెడీని పాటిస్తే కలర్స్ అక్కర్లేదు సహజంగానే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం తెల్ల జుట్టును నల్లగా మార్చే ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.
ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్( Kalonji Seeds ) వేసి మెత్తని పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు కలోంజి సీడ్స్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్లు ఆమ్లా పౌడర్( Amla powder ), రెండు టేబుల్ స్పూన్లు కాఫీ పౌడర్( Coffee powder ), వన్ టేబుల్ స్పూన్ నీమ్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమం కాస్త థిక్ గా మారేంత వరకు ఉడికించాలి.ఆపై స్టవ్ ఆఫ్ చేసుకుని ఉడికించిన మిశ్రమాన్ని చల్లారబెట్టుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరువెచ్చని నీటితో హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి ఒకసారి ఈ రెమెడీని పాటిస్తే తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారుతుంది.ఈ రెమెడీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.కాబట్టి తెల్ల జుట్టు తో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించండి.
పైగా ఈ రెమెడీని పాటిస్తే చుండ్రు దెబ్బకు పరార్ అవుతుంది.హెయిర్ ఫాల్ సైతం కంట్రోల్ అవుతుంది.