వేసవికాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్లు( Mangoes ) మార్కెట్లో భారీగా దొరుకుతుంటాయి.ప్రతి ఒక్కరు కూడా మామిడి పండ్లను తినడానికి ఇష్టపడతారు.
అయితే మార్కెట్లో చాలా రకాల మామిడి కాయలు ఉంటాయి.ప్రతి ఒక్క మామిడిపండు ఒక రకమైన రుచితో కూడి ఉంటుంది.
ఇక చాలామంది మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు.కానీ మరికొందరు ఏమో మామిడి పండ్లను తినడం వలన బరువు పెరుగుతారని( Weight gain ) భావించి వాటికి దూరంగా ఉంటారు.
అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం.

మామిడి పండును తినడం వలన బరువు పెరుగుతారు అన్న విషయం వాస్తవం కాదు.ఎందుకంటే మామిడి పండ్లలో కొవ్వు, సోడియం, కొలెస్ట్రాల్ లాంటివి ఉండవు.ఇందులో కొవ్వు, కొలెస్ట్రాల్ అస్సలు ఉండవు.
అందుకే దీన్ని తీసుకోవడం వలన అసలు బరువు పెరగరు.అయితే మామిడి పండు తినడం వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
మామిడి పండులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.దీని వలన కళ్ళకు మేలు ( eyes )జరుగుతుంది.
అంతేకాకుండా కంటి చూపు పెరగాలంటే కూడా కచ్చితంగా మామిడిపండ్లను తినాలి.

మామిడిపండు రుచికరంగా మాత్రమే కాకుండా చెడు కొలెస్ట్రాల్లో నియంత్రించడంలో కూడా చాలా సహాయపడుతుంది.ఎందుకంటే మామిడిపండులో ఫైబర్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.అంతేకాకుండా మామిడిపండులో చాలా రకాల ఎంజైమ్ లు కూడా ఉంటాయి.
ఎంజైమ్ ఆహారాన్ని విచ్ఛిన్నంగా చేయడానికి పనిచేస్తాయి.దీనివలన ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇది సహాయపడుతుంది.
ఈ విధంగా మామిడి పండ్లను తీసుకోవడం వలన బరువు తగ్గవచ్చు.

అంతేకానీ బరువు పెరగరు.నిజానికి మామిడి గింజల్లో ఉండే ఫైబర్లు శరీరంలో నిల్వ ఉండే అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి.దీంతోపాటు మామిడిని తినడం వలన ఆకలి కూడా తగ్గిపోతుంది.
దీన్ని తినడం వలన చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంటుంది.అలాగే మామిడిపండు ముఖానికి కూడా చాలా ప్రయోజనాలను ఇస్తుంది.
పండిన మామిడిపండు గుజ్జును ( Mango pulp )ముఖానికి రాసుకుంటే ముఖం మెరుస్తూ ఉంటుంది.అలాగే జ్ఞాపక శక్తి పెంచడంలో కూడా మామిడిపండు బాగా సహాయపడుతుంది.







