స్వప్న దత్( Swapna Dutt ) .ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
తన తండ్రి స్థాపించిన వైజయంతి మూవీస్( Vyjayanthi Movies ) ని వారసత్వంగా తీసుకొని ఎంతో చక్కటి సినిమాలు తీస్తూ తండ్రి ని మించిన తనయ కు పేరు సంపాదించుకున్నారు స్వప్న.అశ్విని దత్( Ashwini Dutt ) నేను ఇక సినిమాలు చేయాలను అంటూ పక్కకు తప్పుకున్న కూడా తన తండ్రి సినిమా పిచ్చి కూతుళ్ళకు ఉండటం తో అయన ముగ్గురు కుమార్తె లు సినిమా రంగంలోనే ఉన్నారు.
మరి ముఖ్యంగా అందరి కంటే ముందు స్వప్న నిర్మాణ సంస్థను నిలబెట్టాలి అని అంతకన్నా ముందు తానేంటో కూడా నిపించుకోవాల్సి ఉందని అందుకే స్వప్న మూవీస్ అనే మరొక బ్యానర్ ని కూడా స్థాపించి తమ రెండు సంస్థల తరపున సినిమాలను తీస్తూ వెళ్తున్నారు.
అయితే స్వప్న కు మంచి అభిరుచి ఉన్న నిర్మాత గా పేరు వుంది.2000 ల సంవత్సరంలో అసోసియేట్ ప్రొడ్యూసర్ గా ఆ తర్వాత లైన్ ప్రొడ్యూసర్ గా, ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారింది.ఆమె నిర్మించిన ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, సీతారామం సినిమాలు స్వప్న దత్ క్యాలిబర్ కి నిదర్శనాలు.
ఆమె ఆ సినిమాలు నిర్మించిన తీరు ఎంతో అద్భుతం.అందుకోసం చాలానే కష్టపడింది.
తన చెల్లెళ్ళతో కలిసి ఆ సినిమాలను విజయవంతంగా మలిచింది.ఇక ఈ సినిమాలు మాత్రమే కాదు.
మొదటి నుంచి చిన్న కథ అయినా కూడా ఆమె ఎంచుకునే విధానం చక్కగా ఉంటుంది.ఆ క్రమం లో స్వప్న దగ్గరకు చాలానే కథలు వస్తు ఉంటాయి.
ఇక స్వప్న దగ్గరకు వచ్చిన ఎన్నో కథల్లో కొన్ని మాత్రమే పట్టాలు ఎక్కుతాయి.కానీ కొన్ని సార్లు స్వప్న చేయాలి అనుకున్న కూడా చేయలేని చిత్రాలు ఉంటాయి.అలాంటి కథను చేయకపోవడం కొన్ని సార్లు బాధిస్తుంది కూడా.
అలాంటి ఒక కథే అర్జున్ రెడ్డి.( Arjun Reddy ) ప్రతి దశలో సినిమా కొత్త పుంతలు తొక్కుతుంది అని, అర్జున్ రెడ్డి కూడా ట్రెండ్ సెట్టర్ అయ్యే అవకాశం ఉంటుందని కథ విన్న రోజే తాను అనుకున్నానని, ఆ సినిమా చేయాలనీ బలంగా కోరుకున్నప్పటికీ కొన్ని కారణాల చేత చేయలేకపోయానని, ఆ విషయం గుర్తు వచ్చినప్పుడల్ల అదో తీవ్రమైన బాధ ఉంటుందని ఇటీవల స్వప్న ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.