సాధారణంగా రోజులో ఎన్నో సార్లు టవల్‌ను వాడుతుంటారు.చెమట తుడుచుకునేందుకు, స్నానం చేసిన తర్వాత నీట తడిసిన ఒంటిని శుభ్రం చేసుకునేందుకు, తలను ఆరబెట్టుకునేందుకు, చేతులను, కాళ్లను క్లీన్ చేసుకునేందుకు ఇలా అనేక పనుల కోసం టవల్‌ను యూజ్ చేస్తుంటారు.
ఈ క్రమంలోనే కొన్ని కొన్ని పొరపాట్లు కూడా చేస్తుంటారు.ఈ పొరపాట్లే ఆరోగ్యానికి ముప్పుగా మారతాయి.
ముఖ్యంగా చాలా మంది ఒకే టవల్‌ను రోజుల తరబడి వాడుతుంటారు.
చిరగలేదు, బాగానే ఉంది అనే కారణాలతో టవల్‌ను వాడుతూనే ఉంటారు.
కానీ, ఇలా చేయడం చాలా పొరపాటు.పదే పదే టవల్స్‌ను వాష్ చేయడం వల్ల అవి బిరుసుగా తయారైపోతాయి.
అందువల్ల, వీటిని రోజుల తరబడి వాడితే చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.సో టవల్‌ను నాలుగు లేదా ఐదు నెలలకు మారుస్తూ ఉండాలి.

అలాగే చాలా మంది టవల్‌ను వాడిన తర్వాత కుర్చీలపై, సోఫాలపై, బెడ్లపై ఇలా ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటారు.మళ్లీ అక్కడ నుంచే తీసుకుని వాడుతుంటారు.కానీ, ఇలా చేయడం వల్ల టవల్లో తడి అలానే ఉంటుంది.దాంతో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.ఈ బ్యాక్టీరియా మీ శరీరానికి పట్టేసి జబ్బుల బారిన పడుతుంటారు.కాబట్టి, టవల్‌ను వాడిన తర్వాత గాలి తగిలే చోట ఆరబెట్టుకోవాలి.
ఇక టవల్స్‌ను వాడుతుంటారు.కానీ, ఉతకరు.అలా ఉతకకుండానే ప్రతి రోజు యూజ్ చేస్తుంటారు.ఇదే పొరపాటు.
వాష్ చేయకుండా ఉంటే టవల్స్‌లో కోలిఫామ్ అనే బ్యాక్టీరియా పేరుకుపోతుంది.అలాంటి టవల్‌ను యూజ్ చేయడం వల్ల చర్మ సమస్యలతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి.
కాబట్టి, టవల్స్‌ను డే బై డే ఖచ్చితంగా ఉతుక్కోవాలి.అది కూడా వేడి నీటితో వాష్ చేసుకుంటే మంచిది.