నమ్మలేని స్నేహం.. పులిని ప్రేమగా కౌగిలించుకున్న ఎలుగుబంటి.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే?

ఇంటర్నెట్‌లో జంతువుల వీడియోలు మనల్ని ఎంతగా ఆకట్టుకుంటాయి.కొన్ని నవ్విస్తే, కొన్ని ఆశ్చర్యపరుస్తాయి, మరికొన్ని మనసును తాకుతాయి.

 Unbelievable Friendship: A Bear Lovingly Hugs A Tiger.. Do You Have To Say Wow W-TeluguStop.com

ఇప్పుడు అలాంటి ఓ వీడియోనే నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది.ఇందులో ఓ ఎలుగుబంటి, పులి (Bear, tiger)మధ్య కనిపించిన అరుదైన స్నేహం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

చూసిన వారి మనసులను కదిలిస్తోంది ఈ వీడియో.అయితే, ఈ వీడియో ఎక్కడ తీశారనేది మాత్రం తెలియరాలేదు.“నేచర్ ఈజ్ అమేజింగ్” (Nature is Amazing) అనే ఎక్స్‌ పేజీలో ఈ వీడియోను షేర్ చేశారు.షేర్ చేసిన కొద్ది టైంలోనే వైరల్ అయిపోయింది.ఇప్పటికే దాదాపు 9 లక్షల వ్యూస్ వచ్చాయి.“ఊహించని స్నేహాలే అత్యంత అందమైనవి” అనే క్యాప్షన్‌తో దీన్ని పంచుకున్నారు.వీడియోలో ఏముందంటే, ఓ ఎలుగుబంటి, పెద్ద పులి ప్రశాంతంగా పక్కపక్కనే కూర్చొని ఉన్నాయి.కెమెరా ఎలుగుబంటిపై ఫోకస్ చేయగా, అది ఎంతో ప్రేమగా పులిని (Tigger)దగ్గరకు తీసుకుని కౌగిలించుకుంటుంది.

నిజానికి ఈ రెండూ భయంకరమైన జంతువులు, పైగా వేర్వేరు జాతులు.కానీ, పులి మాత్రం ఎలాంటి భయం, ఆందోళన లేకుండా చాలా ప్రశాంతంగా, ఎలుగుబంటి ఇచ్చే ఆప్యాయతను ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తుంది.ఆ రెండింటి మధ్య భయం గానీ, కోపం గానీ కనిపించదు.కేవలం స్వచ్ఛమైన ప్రేమ, నమ్మకం మాత్రమే కనిపిస్తాయి.ఎలుగుబంటి(Bear) అంత సున్నితంగా పులిని(TIger) హత్తుకోవడం చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది.

ఈ అసాధారణ స్నేహాన్ని చూసి నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇప్పటికే 300లకు పైగా కామెంట్లు వచ్చాయి.ఒక యూజర్ “వావ్.

ఎంత క్యూట్‌గా ఉన్నాయో.బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉన్నాయి” అని రాశారు.

మరొకరు “ఇలాంటి ఊహించని స్నేహాలు భలే ఉంటాయి” అని కామెంట్ చేశారు.చాలా మంది ఈ రెండు జంతువుల ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయారు.“ఒక ఎలుగుబంటి ఇంత సున్నితంగా ఉండటం నేను ఎప్పుడూ చూడలేదు” అని ఒకరు అంటే, “పులి లాంటి వేటాడే జంతువు ఇంత ప్రశాంతంగా ఉండటం నమ్మశక్యంగా లేదు.ఎంత అందమైన దృశ్యం” అని ఇంకొకరు తమ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube