త్రిమూర్తులు ప్రతిష్టించిన వినాయకుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

మన హిందూ పురాణాల ప్రకారం ఎన్నో ఆలయాలలోని విగ్రహాలు స్వయంభూగా వెలిసిన కాగా మరికొన్ని విగ్రహాలు దేవతల చేత ప్రతిష్ఠించబడిన ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.ఈ క్రమంలోనే త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు స్వయంభుగా ప్రతిష్టించిన వినాయకుడి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందినది.

 Unknown Facts Behind The Kurudumale Ganapathi, Karnataka, Pooja, Trimurthulu, Ku-TeluguStop.com

అయితే త్రిమూర్తులు ప్రతిష్టించిన వినాయకుడి ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ విశిష్టతలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

కర్ణాటకలోని కోలారు జిల్లా, కురుడుమలె అనే గ్రామంలో ఈ వినాయకుడి ఆలయం ఉంది.కురుడుమలె గ్రామంలో ఉండటం వల్ల వినాయకుడిని కురుడుమలె వినాయకుడి గా ప్రసిద్ధి చెందాడు.

పురాణాల ప్రకారం చోళుల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది.ఈ ఆలయంలో వెలసిన స్వామి వారు 14 అడుగుల ఎత్తులో ఏక సాలగ్రామ శిలగా భక్తులకు దర్శనమిస్తుంది.

ఈ ఆలయంలో వెలసిన వినాయకుడు సాక్షాత్తు త్రిమూర్తుల చేత ప్రతిష్టించబడినది.త్రిపురాసుర సంహారానికి ముందు త్రిమూర్తులు ఈ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి కార్య విఘ్నాలు తొలగిపోవాలని పూజించి, త్రిపురాసుర సంహారానికి బయలుదేరారని పురాణాలు చెబుతున్నాయి.

అదేవిధంగా త్రేతాయుగంలో ఈ ఆలయంలోని వినాయకుడిని సందర్శించి రాముడు లంకకు చేరుకొని విజయంతో తిరిగి వచ్చారు.అదేవిధంగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు, పాండవులు ఈ ఆలయాన్ని సందర్శించారని అక్కడి శాసనాలు చెబుతున్నాయి.ఈ ఆలయంలో వెలసిన వినాయకుడి ప్రత్యేకత ఏమిటంటే ఎవరికైతే కార్యాలు జరగకుండా నిత్యం ఆటంకం కలిగి ఉంటారో అలాంటి వారు ఈ ఆలయంలో వెలసిన స్వామివారిని దర్శించి పూజలు నిర్వహిస్తే వారికి ఏ విధమైన ఆటంకం కలగదని అక్కడి ప్రజల విశ్వాసం ఏదైనా కొత్త పని మొదలు పెట్టేటప్పుడు ఆలయాన్ని సందర్శించడం వల్ల ఆ పని నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది.అదేవిధంగా భక్తులు భక్తిశ్రద్ధలతో కోరిన కోరికలను తప్పకుండా స్వామివారు నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తారు.

అందుకే నిత్యం వందల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు.

Unknown Facts Behind The Kurudumale Ganapathi, Karnataka, Pooja, Trimurthulu, Kurudumale Ganapathi, Brahma, Vishnu, Maheswar, Sri Ram, Lanka, Ganapathi, Telugu Bhakti - Telugu Brahma, Ganapathi, Karnataka, Lanka, Maheswar, Pooja, Sri Ram, Telugu Bhakti, Trimurthulu, Vishnu

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube