నాగార్జున హీరోగా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు తెరకెక్కించిన సినిమా జనాకి రాముడు.ఈ సినిమాలో విజయశాంతి, జీవిత హీరోయిన్లుగా నటించారు.
ఏఎన్నారు, సావిత్రి జంటగా నటించిన క్లాసికల్ ఫిల్మ్ మూగమనులు మాదిరిగానే ఈ సినిమా రూపొందించాడు దర్శకుడు.మూగ మనుసులు సినిమాలో జమున చేసిన క్యారెక్టర్ లాగే జానకి రాముడు సినిమాల్ జీవిత పాత్ర ముందుకు సాగుతుంది.
స్టోరీకి అనుగుణంగా 90 ఏండ్ల ముసలి క్యారెక్టర్ చేస్తుంది జీవిత.సినిమా మొదట్లో మరోజన్మ కోసం హీరో, హీరోయిన్లు ఎదురు చూస్తారు.సినిమా చివరకు ఆ పాత్ర మళ్లీ రిపీట్ అవుతుంది.

ముసలి తనాన్ని మేకప్ ద్వారా తీర్చిద్దిద్దవచ్చు.కానీ 90 ఏండ్ల వృద్ధులు నడక, మాటలు, ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేది 20 ఏండ్ల అమ్మాయి చేయడం చాలా కష్టం అని చెప్పవచ్చు.వయసు మీద పడిన వారు యంగ్ క్యారెక్టర్లు చేయగలరు కానీ యంగ్ ఏజ్ లో ఉన్నవాళ్లు ఓల్డ్ క్యారెక్టర్ చేయాలంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు.
అటు జీవితకు ఆ క్యారెక్టర్ చేయాలో అర్థం కాలేదు.అనుకున్నట్లుగా ఔట్ డోర్ షూటింగ్ జరుగుతుంది.భారీగా జనాలున్నారు.ఒవైపు సత్యనారాయణ, నాగార్జున, మోహన్ బాబు, విజయశాంతి ఉన్నారు.
అదే సమయంలో జీవితం ఎంతో టెన్షన్ కు గురయ్యింది.చివరకు ఎలా చేయాలో చెప్పాలని దర్శకుడిని అడిగింది.

తను చాలా కూల్ గా సమాధానం చెప్పాడు.నువ్వు అనవసరంగా ఆందోళన పడకు.ఈజీగా చెయ్యొచ్చని చెప్పాడు.ఒకసారి తనను చేసి చూపించాలని అడిగింది జీవిత.సరే అని తను యాక్ట్ చేసి చూపించాడు.అతడు ఎలా చేశాడో జీవిత కూడా అలాగే చేసింది.
సింగిల్ టేక్ లో సీన్ ఓకే అయ్యింది.ఆ క్యారెక్టర్ లోని సీన్లను రెండు రోజుల పాటు ఫూట్ చేశారు.
ఆ రెండు రోజుల పాటు జీవిత చాలా ఆందోళన పడ్డట్లు పలుమార్లు చెప్పింది జీవిత.