మీ పళ్ళు పసుపు పచ్చగా మారి నోటి దుర్వాసన కలిగి రావడం వల్ల ఎవరితోనైనా మాట్లాడడం లేదా ఇతరుల ముందు నవ్వడం అసౌకర్యంగా ఉంటుంది.దంతాల పసుపు( Yellow Teeth ) అనేది మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తూ ఉంది.
ముఖ్యంగా చెప్పాలంటే మిఠాయిలు తీసుకోవడం, దంతాలపై సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి అనేక కారణాల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతాయి.మీరు ప్రతి రోజు తినే ఆహారం కణాలు దంతాలపై పేరుకుపోవడం వల్ల కూడా జరుగుతుంది.
ఇది పసుపు దంతాలకు అతిపెద్ద కారణమని నిపుణులు చెబుతున్నారు.దీనిని నివారించుకోవడానికి, మీ దంతాలను( Teeth ) మరింత మెరుగుపరచుకోవడానికి అవసరమైన చిట్కాలు ఇప్పుడు తెలుసుకుందాం.

దంతాలు పసుపు రంగులోకి మారడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే పొగాకు వాడకం, అధిక కాఫీ, టీ వినియోగం, ధూమపానం( Smoking ) లాంటి చెడు అలవాట్లు ఎనామిల్ నీ ప్రభావితం చేసే వ్యాధులు, అంతర్గత ఔషధం, వృద్ధాప్యం వంటివి ఎన్నో కారణాలు ఉంటాయి.అయితే పసుపు దంతాలను తెల్లగా మార్చుకోవడానికి చాలా మంది వైద్యుల దగ్గరికి వెళుతూ ఉంటారు.మీ పసుపు దంతాలు తెల్లగా మారాలంటే ఏడూ తులసి ఆకులను( Tulsi Leaves ) తీసుకొని మెత్తగా పేస్టు లా చేసుకోవాలి.
ఎండిన నారింజ తొక్కను కొద్ది మొత్తంలో తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి.

తర్వాత రెండిటిని కలిపి మెత్తగా పేస్టులా చేసుకోవాలి.ఈ పేస్టుని నేరుగా మీ దంతాల మీద అప్లై చేసి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.ఆ తర్వాత సాధారణ నీటితో మీ నోటిని శుభ్రం చేసుకోవాలి.
తెల్లటి దంతాల కోసం ఈ చిట్కాను పాటించడం వల్ల ఎలాంటి చెడు ప్రభావం ఉండదు.అలాగే రెండు టీ స్పూన్ల బేకింగ్ సోడా( Baking Soda ) తీసుకొని నీటిలో కలిపి మందపాటి పేస్టులా చేసుకోవాలి.
ఈ పేస్టును మీ దంతాలపై అప్లై చేసి ఐదు నిమిషాలు అలాగే ఉంచాలి.ఈ పేస్టును మీ దంతాల మీద అప్లై చేసిన తర్వాత మీ నోటిని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు తెల్లటి దంతాల కోసం ఈ ఇంటి చిట్కాను అనుసరించడం వల్ల ఫలితం ఉంటుంది.