సంక్రాంతికి క‌చ్చితంగా అరిసెలు ఎందుకు తినాలి..?

ఆనందానికి, ఉత్సాహానికి చిహ్నమైన సంక్రాంతి పండుగ( Sankranthi Festival ) రాబోతోంది.భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒక‌టి.

 Do You Know Why Ariselu Should Be Eaten On Sankranti Details, Sankranti, Ariselu-TeluguStop.com

భోగి, మకర సంక్రాంతి, క‌నుమ‌. ఇలా మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకుంటారు.

సంక్రాంతిని ప్రధానంగా పంటల పండుగగా నిర్వ‌హిస్తారు.అలాగే ఈ పండుగ‌తో ప్రకృతి, రైతులు మరియు పంటల సిరులకు కృతజ్ఞతలు చెబుతారు.

అయితే సంక్రాంతి అన‌గానే గుర్తుకు వ‌చ్చేవి పిండి వంట‌లు, కొత్త బ‌ట్ట‌లు, రంగవల్లులు, గంగిరెద్దు ఆటలు, హరిదాసుల భజనలు, కోడి పందాలు, గాలిపటాలు.అబ్బో ఆ హ‌డావుడినే వేరె లెవ‌ల్ లో ఉంటుంది.

పిండి వంట‌ల విష‌యానికి వ‌స్తే.సంక్రాంతికి దాదాపు అంద‌రి ఇళ్ల‌ల్లో అరిసెల‌ను( Ariselu ) త‌యారు చేస్తుంటారు.సంక్రాంతికి అరిసెలు తినడం పూర్వకాలం నుంచి కొనసాగుతోంది.ఇది కేవ‌లం సంప్రదాయం మాత్ర‌మే కాదు.

దీని వెనుక కొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి.సంక్రాంతి టైమ్ కి చలికాలం( Winter ) ముగిసి ఉష్ణకాలం స్టార్ట్ అవుతుంది.

ఈ మార్పు శరీరంపై ప్రభావం చూపుతుంది.అయితే అరిసెల్లో ఉండే బెల్లం మరియు నువ్వులు శరీరాన్ని వేడిగా ఉంచి ఈ మార్పులకు అనువుగా మార్చుతాయి.

Telugu Ariselu, Tips, Jaggery, Latest, Sankranti, Sesame Seeds-Telugu Health

అలాగే సంక్రాంతి పండుగ ప్రధానంగా రైతులు( Farmers ) తమ పంటలను కోసి ఆ ఆనందాన్ని పంచుకునే సందర్భం.అయితే పంటలను కోయడంలో రైతులు అధిక శారీరక శ్రమను వెచ్చిస్తారు.అలాంటి స‌మ‌యంలో అరిసెలు తింటే.వాటిలో ఉండే బెల్లం, నువ్వులు, బియ్యం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.శ్రమను తట్టుకోగలిగే సామ‌ర్థాన్ని చేకూరుస్తాయి.

Telugu Ariselu, Tips, Jaggery, Latest, Sankranti, Sesame Seeds-Telugu Health

పైగా అరిసెల్లో ఉపయోగించే నువ్వులు శ‌రీరానికి ఫైబర్‌ను అందించి జీర్ణతంత్రాన్ని బలపరుస్తాయి.నువ్వుల్లో ఉండే ఒమెగా-6 ఫ్యాటీ ఆమ్లాలు మరియు ఇతర పోషకాలు హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తాయి.బెల్లం రక్తాన్ని శుభ్రపరచడంలో, ర‌క్త‌హీన‌త‌ను ( Anemia ) నివారించ‌డంలో తోడ్ప‌డ‌తాయి.

ఇక కొత్త సంవత్సరం ప్రారంభానికి, ప్రకృతి సిరులను ఆరాధించడానికి, మరియు ఆరోగ్యంగా ఉండటానికి అరిసెలు ముఖ్యమైనవి.అందుకే సంక్రాంతికి క‌చ్చితంగా అరిసెలు తినాల‌ని పెద్ద‌లు చెబుతుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube