ప్రస్తుత రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా కోట్లాది మందిని వేధించే జుట్టు సంబంధిత సమస్యల్లో వైట్ హెయిర్, డాండ్రఫ్, హెయిర్ ఫాల్ వంటివి ముందు వరసలో ఉంటాయి.అందులో ఎటువంటి సందేహం లేదు.
ఆహారపు అలవాట్లు, పోషకాల కొరత, మారిన జీవనశైలి, కాలుష్యం, జుట్టు సంరక్షణ లేకపోవడం, కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ ప్రోడెక్ట్స్ ను యూస్ చేయడం వంటి రకరకాల కారణాల వల్ల ఆయా జుట్టు సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
దాంతో వాటి నుంచి బయట పడటం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు.
జుట్టుపై ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు.ఈ లిస్ట్‌లో మీరు ఉన్నారా.? అయితే అస్సలు వర్రీ అవ్వకండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే ప్యాక్‌ను వేసుకుంటే వైట్ హెయిర్, డాండ్రఫ్, హెయిర్ ఫాల్ అన్నిటికీ చెక్ పెట్టొచ్చు.
మరి లేటెందుకు ఆ హెయిర్ ప్యాక్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.

ముందుగా ఐదారు మందారం ఆకులు, ఒక కప్పు గోరింటాకు ఆకులు తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.అలాగే మరోవైపు చిన్న బీట్‌రూట్ ను తీసుకుని తొక్క తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో కడిగి పెట్టుకున్న మందారం ఆకులు, గోరింటాకు ఆకులు, బీట్‌రూట్ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మ రసం, వన్ ఎగ్ వైట్, ఐదు టేబుల్ స్పూన్ల పెరుగు, మూడు టేబుల్ స్పూన్ల ఫ్రెష్ అలోవెర జెల్, రెండు గింజ తొలగించిన ఉసిరి కాయలు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి రెండు గంటల పాటు షవర్ క్యాప్ పెట్టేసుకోవాలి.ఆపై మైల్డ్ షాంపూను యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారంలో ఒక్కసారి ఈ ప్యాక్‌ను వేసుకుంటే వైట్ హెయిర్, హెయిర్ ఫాల్, డాండ్రఫ్ వంటి సమస్యలు దూరమై జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది.