ప్రతి మహిళ ఒత్తైన అందమైన జుట్టు కావాలని కోరుకోవటం సహజమే.కానీ కొన్ని పరిస్థితుల కారణంగా జుట్టు రాలుతుంది.
అంతేకాక చుండ్రు సమస్య కూడా వేధిస్తుంది.ఇటువంటి సమస్యలకు చెక్ పెట్టాలంటే కొన్నిసుగంధ ద్రవ్య నూనెల పాక్స్ ఉపయోగించాలి.
ఇవి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.ఇప్పుడు ఆ పాక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఒక స్పూన్ ఆముదంలో 4 చుక్కల లావెండర్ సుగంధ నూనెను కలిపి జుట్టు
కుదుళ్లకు పట్టించి 15 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో తేలికపాటి
షాంపూతో తలస్నానము చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా
పెరుగుతుంది.ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే వచ్చే తేడాను గమనించి మీరే
ఆశ్చర్యపోతారు.
ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ లో 4 చుక్కల జొజుబా సుగంధ నూనెను కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి 20 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
ఒక స్పూన్ కొబ్బరినూనెలో 4 చుక్కల కేదార్ వుడ్ సుగంధ నూనెను కలిపి జుట్టు కుదుళ్లకు పట్టించి 10 నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో తేలికపాటి షాంపూతో తలస్నానము చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా,కాంతివంతంగా మారుతుంది.ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే సరిపోతుంది.