సంక్రాంతికి కచ్చితంగా అరిసెలు ఎందుకు తినాలి..?
TeluguStop.com
ఆనందానికి, ఉత్సాహానికి చిహ్నమైన సంక్రాంతి పండుగ( Sankranthi Festival ) రాబోతోంది.భారతీయ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి.
భోగి, మకర సంక్రాంతి, కనుమ.ఇలా మూడు రోజుల పాటు ఎంతో ఆనందంగా పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు.
సంక్రాంతిని ప్రధానంగా పంటల పండుగగా నిర్వహిస్తారు.అలాగే ఈ పండుగతో ప్రకృతి, రైతులు మరియు పంటల సిరులకు కృతజ్ఞతలు చెబుతారు.
అయితే సంక్రాంతి అనగానే గుర్తుకు వచ్చేవి పిండి వంటలు, కొత్త బట్టలు, రంగవల్లులు, గంగిరెద్దు ఆటలు, హరిదాసుల భజనలు, కోడి పందాలు, గాలిపటాలు.
అబ్బో ఆ హడావుడినే వేరె లెవల్ లో ఉంటుంది.పిండి వంటల విషయానికి వస్తే.
సంక్రాంతికి దాదాపు అందరి ఇళ్లల్లో అరిసెలను( Ariselu ) తయారు చేస్తుంటారు.సంక్రాంతికి అరిసెలు తినడం పూర్వకాలం నుంచి కొనసాగుతోంది.
ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు.దీని వెనుక కొన్ని కారణాలు కూడా ఉన్నాయి.
సంక్రాంతి టైమ్ కి చలికాలం( Winter ) ముగిసి ఉష్ణకాలం స్టార్ట్ అవుతుంది.
ఈ మార్పు శరీరంపై ప్రభావం చూపుతుంది.అయితే అరిసెల్లో ఉండే బెల్లం మరియు నువ్వులు శరీరాన్ని వేడిగా ఉంచి ఈ మార్పులకు అనువుగా మార్చుతాయి.
"""/" /
అలాగే సంక్రాంతి పండుగ ప్రధానంగా రైతులు( Farmers ) తమ పంటలను కోసి ఆ ఆనందాన్ని పంచుకునే సందర్భం.
అయితే పంటలను కోయడంలో రైతులు అధిక శారీరక శ్రమను వెచ్చిస్తారు.అలాంటి సమయంలో అరిసెలు తింటే.
వాటిలో ఉండే బెల్లం, నువ్వులు, బియ్యం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి.శ్రమను తట్టుకోగలిగే సామర్థాన్ని చేకూరుస్తాయి.
"""/" /
పైగా అరిసెల్లో ఉపయోగించే నువ్వులు శరీరానికి ఫైబర్‌ను అందించి జీర్ణతంత్రాన్ని బలపరుస్తాయి.
నువ్వుల్లో ఉండే ఒమెగా-6 ఫ్యాటీ ఆమ్లాలు మరియు ఇతర పోషకాలు హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తాయి.
బెల్లం రక్తాన్ని శుభ్రపరచడంలో, రక్తహీనతను ( Anemia ) నివారించడంలో తోడ్పడతాయి.ఇక కొత్త సంవత్సరం ప్రారంభానికి, ప్రకృతి సిరులను ఆరాధించడానికి, మరియు ఆరోగ్యంగా ఉండటానికి అరిసెలు ముఖ్యమైనవి.
అందుకే సంక్రాంతికి కచ్చితంగా అరిసెలు తినాలని పెద్దలు చెబుతుంటారు.
చీర కట్టుకుని గాజులు వేసుకుని సీతలా నటించాను.. రవి కిషన్ కామెంట్స్ వైరల్!