మధ్యాహ్నం సమయంలో నిద్రపోతే ఆరోగ్యానికి మంచిదేనా..?

ముఖ్యంగా చెప్పాలంటే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాసేపు నిద్రపోవడం ( sleep )చాలా మందికి అలవాటు ఉంటుంది.ఇక నేషనల్ స్లీప్ ఫౌండేషన్ చేసిన అధ్యయనం ప్రకారం యునైటెడ్ స్టేట్స్ లో దాదాపు 30 శాతం మంది యువకులు మధ్యాహ్నం తరువాత క్రమం తప్పకుండా నిద్రపోతున్నారు.

 Is Sleeping In The Afternoon Good For Health , Health , Health Tips , Sleep,-TeluguStop.com

ఈ మధ్యాహ్న నిద్ర మరింత శక్తిని ఇస్తుందని అధ్యయనాలలో తెలిసింది.నేప్స్ వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు( Health benefits ) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మధ్యాహ్నం ఒకటి నుంచి నాలుగు గంటల మధ్య చాలా మందిలో కూడా నిద్ర కలుగుతుంది.ఈ సమయంలో మన శరీర ఉష్ణోగ్రత కొద్దిగా తగ్గుతుంది.

అందువల్ల మనకు నీరసం, చురుకుదనం కూడా తగ్గుతుంది.

Telugu Pressure, Diabetes, Benefits, Tips, Heart, Sleep-Telugu Health

కాబట్టి కాసేపు నిద్రపోవడం మనకు రిఫ్రెష్ గా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.మధ్యాహ్నం నిద్ర చురుకుతనాన్ని మెరుగుపరచడానికి ఇంకా అభిజ్ఞ పనితీరు సరైన విధంగా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇది రోజంతా కూడా మరింత దృష్టి కేంద్రీకరించడంలో మీకు సహాయపడుతుంది.

మధ్యాహ్నం న్యాప్స్ కార్టిసాల్ స్థాయిలను తగ్గించుకోవడంలో, ఆందోళనను తగ్గించుకోవడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.దీనివల్ల మీలో ఉండే అనవసరమైన భయాందోళనలను సులభంగా దూరం చేసుకోవచ్చు.

అలాగే నిద్ర మానసిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది.అలాగే భావోద్వేగ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది.

ఇతరులతో మరింత సానుకూల దృక్పథం ఇంకా పరస్పర చర్యలకు దారితీస్తుంది.

Telugu Pressure, Diabetes, Benefits, Tips, Heart, Sleep-Telugu Health

రోజంతా శరీరక మానసిక పనిలో నిబంధనమైన వారు విశ్రాంతి కోసం మధ్యాహ్నం నిద్ర పోవడం మంచిదని ఇప్పుడు చెబుతున్నారు.చాలామంది ఒత్తిడిని మరిచిపోయి నిద్రపోతారు.కాబట్టి మధ్యాహ్నం నిద్ర హై బీపీని సులభంగా దూరం చేస్తుంది.

ఇంకా చెప్పాలంటే ఇది రక్తపోటును( Blood pressure ) కూడా తగ్గిస్తుంది.అలాగే గుండె జబ్బుల ( Heart disease )ప్రమాదాన్ని కూడా దూరం చేస్తుంది.

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.ఇంకా చెప్పాలంటే డయాబెటిస్, ( Diabetes )ఈసీఓడీ, థైరాయిడ్ సమస్యలకు పరిష్కారంగా మధ్యాహ్నం నిద్ర ఉపయోగపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

నిద్ర అనారోగ్య సమస్యల ( Sleep disorders )నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube