దేవాలయాల్లో కొబ్బరికాయ కొట్టడం వెనుక అసలు రహస్యమిదే!

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం దేవాలయంలో లేదా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ దేవదేవుడుకి సమర్పిస్తాము.మనదేశంలో ఇలాంటి సంస్కృతి సంప్రదాయాలను పాటించడం ఆనవాయితీ.

 Reason Behind Coconut Breaking In Temple, God,coconut Breaking, Temples, Hindu D-TeluguStop.com

గుడికి వెళ్లడం ద్వారా ఎంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది.అయితే గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ డబ్బు రూపంలోనూ, కానుకల రూపంలో దేవుళ్లకు సమర్పిస్తుంటారు.

కొబ్బరి కాయను కొట్టడం ద్వారా ఎలాంటి ఫలితాలు కలుగుతాయి? కొబ్బరికాయలు దేవుడి ముందు ఎందుకు కొడతారు దాని వెనుక రహస్యం ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.

మన పురాతన గ్రంథాల ప్రకారం, కొబ్బరికాయ బయట భాగాన్ని వ్యక్తి యొక్క కోపం, అహం గుణాలుగా పరిగణిస్తారు.

అయితే కొబ్బరికాయలు లోపలి భాగం స్వచ్ఛమైన, అమాయకమైన అన్ని సానుకూల ఆలోచనలు, లక్షణాలను పరిగణిస్తుంది.అందువల్ల దేవుని ముందు కొబ్బరికాయ కొట్టడం వల్ల మనలో ఉన్న కోపం అహాన్ని పగలగొట్టి, స్వచ్ఛమైన మంచి ఆలోచనలను కలిగించమని దేవుని వేడుకోవడం.

అయితే ఒకసారి కొబ్బరి కాయ కొడితే సరిపోతుంది కదా? వెళ్లిన ప్రతిసారీ కొబ్బరికాయ కొట్టడం ఎందుకు? అన్న ఆలోచనలు కలగవచ్చు.ఎందుకంటే మానవుడు తేలికగా ప్రతికూల శక్తికి ఆకర్షితులవుతారు.

అందువల్ల గుడికి వెళ్ళిన ప్రతిసారీ కొబ్బరికాయను కొట్టడం మంచిది.

అయితే కొన్నిసార్లు మనం దేవునికి సమర్పించే కొబ్బరికాయ కుళ్ళిపోవడం జరుగుతుంది.

అయితే ఇది అశుభానికి సంకేతం అని భయపడుతూ ఉంటారు.కొబ్బరికాయ కుళ్ళిపోతే మనలోని చెడు ఆలోచనలు అంతటితో పగిలిపోయాయి అని దానికి అర్థం.

అలా కొబ్బరికాయ కుళ్ళి పోయి నప్పుడు దేవాలయంలో నైనా లేదా ఇంట్లో అయినా అలా జరిగితే కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కొని మరొక కొబ్బరికాయను సమర్పించడంవల్ల శుభం జరుగుతుంది.అంతేకాకుండా కొబ్బరికాయలో పువ్వు రావడం వల్ల ఇంట్లో శుభ ఫలితాలు జరగడం లేదా ఇంట్లో సంతానాభివృద్ధి జరుగుతుందని నమ్ముతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube