Lotus Flower : మీ ఇంట్లో ఇలా చేస్తే మహాలక్ష్మి అనుగ్రహం వల్ల సిరి సంపదలు వస్తాయా...

లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలని మన దేశం వ్యాప్తంగా చాలా మంది ప్రజలు ఎప్పుడూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు.ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో ఒకటైన తామర పువ్వు కూడా ఆర్థిక సమస్యలను దూరం చేసే అవకాశం ఉంది.

 If You Do This In Your Home, Will You Get Riches Due To The Grace Of Mahalakshmi-TeluguStop.com

ఎంతో అందమైన పువ్వులలో తామర పువ్వు కూడా ఒకటి.ఈ జల పుష్పానికి సహజమైన ప్రాముఖ్యతతో పాటు జ్యోతిష్య, మతపరమైన ప్రాధాన్యత కూడా ఉంది.

తామర పువ్వు విష్ణుమూర్తి చేతిలో ఉండే పుష్పం.ఈ పువ్వుపై లక్ష్మీదేవి కూర్చొని ఉంటుంది.తామర పువ్వుకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉందని వేద పండితులు చెబుతూ ఉంటారు.కొన్ని నియమాలను పాటిస్తే ధన లాభం కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

అలాగే జీవితంలో ఉన్న ఎన్నో సమస్యలు దూరం అవుతాయని కూడా చెబుతున్నారు.లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే ఎంతో ఇష్టం.

వారంలోని ప్రతి శుక్రవారం తామర పువ్వు తో లక్ష్మీదేవిని పూజించాలి.ఇలా ఐదు శుక్రవారం చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి.

అలాగే డబ్బుకు సంబంధించిన ఏ సమస్య అయినా దూరం అయ్యే అవకాశం ఉంది.

Telugu Astrologers, Bakti, Devotional, Lord Vishnu, Lotus Flower, Lotusflower, M

ఒక వారం రోజులు పాటు శివలింగంపై తామర పువ్వును సమర్పించడం వల్ల మనసులో ఉన్న మంచి కోరికలు అన్ని నెరవేరుతాయి.ఇంకా చెప్పాలంటే శుక్రవారం రోజు కొబ్బరికాయతో పాటు తెల్ల తామర పువ్వును ఉంచి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ ఇంట్లో సిరి సంపదలు పెరిగే అవకాశం ఉంది.అలా 11 వారల పాటు పూజించిన ఆ తామర పువ్వును 11వ శుక్రవారం నదిలో కానీ చెరువులో కానీ వదలడం మంచిది.

తామర పువ్వుకి ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసే శక్తి ఉంది.మనం చేసే ఏ పనిలోనైనా విజయం సాధించాలంటే లక్ష్మీదేవికి కలువ పూలతో పూజ చేయడం మంచిది.

అలా పూజ చేసిన తామర పువ్వును ఎర్రటి గుడ్డలో కట్టి అల్మారాలను ఉంచడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube