వెయ్యేళ్ళ కాలంనాటి దుర్గామాత ఆలయం ఎక్కడుందో తెలుసా?

భారతదేశం పురాతన ఆలయాలకు ఎంతో ప్రసిద్ధి.ఎన్నో పురాతన ఆలయాలు కట్టడాలు ఎక్కువగా మన భారతదేశంలో కనిపిస్తాయి.

 God Durga Devi, Thousand Years Ago Temple, Hindu Temple, Hindu Believes-TeluguStop.com

ఈ ఆలయాలను, కట్టడాలను దర్శించటానికి ఇతర దేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటారు.కొన్ని దేవాలయాలు శతాబ్దాల కాలంలో నిర్మించిన ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి.

అలాంటి చరిత్ర ఉన్న దేవాలయాలలో ఈ గుడి కూడా ఒకటి.అయితే అంత పురాతన చరిత్ర కలిగిన ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయం ప్రాముఖ్యత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

బీహార్ రాష్ట్రంలోని, కైమూర్ జిల్లా, కౌర అనే ప్రాంతంలో ముండేశ్వరి అనే దుర్గామాత ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.ప్రపంచంలోనే అతి పురాతనమైన దేవాలయాలలో ఈ ముండేశ్వరి దేవాలయం ఒకటి.ఈ ఆలయంలో విష్ణు భగవానుడు, శివుడు కూడా కొలువై ఉన్నారు.చరిత్ర కారుల అంచనా ప్రకారం ఈ ఆలయాన్ని మూడవ శతాబ్దంలో నిర్మించినట్లు చెబుతారు వారణాసికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో 625 కాలంనాటి శాసనాలు బయటపడటంతో ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత తెలుస్తోంది.

భారతదేశంలో మొట్టమొదటిగా నిర్మించినదే ఈ దుర్గామాత శక్తి ఆలయం ఈ ముండేశ్వరి ఆలయం ముండేశ్వరి అనే పర్వతం మీద ఉండటంతో ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది.

ఇక్కడ అమ్మవారు భక్తులకు వరాహి మాత గా దర్శనం కల్పిస్తారు.ఈ దేవాలయంలో అమ్మగారు పది చేతులను కలిగి ఉండి ఎద్దుపై స్వారీ చేస్తూ మహిషాసుర మర్ధిని రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.

ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల వారి కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.అంతేకాకుండా ఈ దేవాలయములో నాలుగు ముఖాలు కలిగిన శివుడు, విష్ణుభగవానుడు కూడా కొలువై ఉన్నారు.

పెద్ద ఎత్తున భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహిస్తుంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube