మన దేశంలో దాదాపు చాలా మంది ప్రజలు తులసి మొక్కకు( Basil plant ) ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు.దాదాపు అందరి ఇళ్లలోనూ తులసి మొక్కను ఉంచి పూజలు చేస్తూ ఉంటారు.
మత విశ్వాసాల ప్రకారం తులసి చాలా ప్రత్యేకమైనది.పద్మ పురాణం నుంచి గరుడ పురాణం( Garuda Purana ) వరకు తులసి మొక్క గొప్పదనాన్ని వెల్లడించారు.
శ్రీమహా విష్ణువు,( Lord Vishnu ) లక్ష్మీమాత ఆరాధన తులసి ఆకులు లేకుండా అసంపూర్ణంగా పరిగణిస్తారు.గాలిపుత్రుడైన హనుమంతుడి నైవేద్యంలో తులసి ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు.
అదే సమయంలో ఇంటి ఆవరణలో తులసి మొక్కలు నాటడం వల్ల కుటుంబానికి వచ్చే కష్టనష్టాలు అన్ని దూరమైపోతాయి.

అటువంటి పరిస్థితిలో తులసి మొక్కకు నీటిని అందించడానికి ఏ లోహపు పాత్రను ఉపయోగించడం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే తులసి మొక్క ఎంతో స్వచ్ఛమైనది.తులసి తల్లిని సక్రమంగా పూజిస్తే కోరిన కోరికలు నెరవేరతాయని పండితులు( Scholars ) చెబుతున్నారు.
మీరు తులసి మొక్కకు నీళ్లు పోస్తే రాగి పాత్రను ఉపయోగించవచ్చు.దీనితో వ్యక్తి జాతకంలో గ్రహాల స్థానం బలపడుతుంది.
అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి.అందువల్ల మీరు తులసి మొక్కకు నీరు ఇస్తే రాగి కుండ నుంచి నీరు ఇవ్వడం ప్రజలు పవిత్రంగా భావిస్తారు.

ఇంకా చెప్పాలంటే ఇత్తడి పాత్రను కూడా తులసి మొక్కకు నీళ్లు పోయడం శుభప్రదంగా పరిగణిస్తారు.ఇది సానుకూల శక్తిని పెంచుతుంది.అలాగే విష్ణువు తో పాటు లక్ష్మీదేవి ( Goddess Lakshmi )ఆశీర్వాదాలు కూడా మీపై ఉంచుతుంది.అందువల్ల రాగి ఇత్తడి కుండను ఉపయోగించి తులసి మొక్కకు నీరు ఇవ్వాలి.
ఇది శుభ ఫలితాలను ఇవ్వగలదు.అలాగే జీవితంలో వచ్చే అన్ని కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇంకా చెప్పాలంటే రాగి లేదా ఇత్తడి కుండ లేకపోతే స్టీల్ పాత్రతో తులసి మొక్కకు నీరు ఇవ్వవచ్చు.దీని వల్ల మనసులో ఎప్పుడూ చెడు ఆలోచనలు రావు.కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి.అలాగే వ్యక్తి ఎప్పుడూ ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం రాదని పండితులు చెబుతున్నారు.