మన భారత దేశంలో ఎన్నో రకాల ఆచారాలు, సంప్రదాయాలను చాలా మంది ప్రజలు పాటిస్తారు.అలాగే ఎన్నో నియమాలను వాస్తును కూడా అనుసరిస్తారు.
అలాగే తమలపాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని దాదాపు చాలా మందికి తెలుసు.అయితే మన భారతదేశంలో ఉన్న ఎంతో మంది ప్రజలు శుభకార్యాలలో, పండుగలలో తమలపాకులు కచ్చితంగా ఉపయోగిస్తారు.
ముఖ్యంగా చెప్పాలంటే హిందూ సంప్రదాయంలో ఎలాంటి శుభకార్యాలు జరిగిన కచ్చితంగా తమలపాకు ఉంటుంది.

అలాగే తమలపాకు లేనిదే ఏ శుభకార్యం జరగదు.తమలపాకు అంత ప్రత్యేకమైన స్థానం ఉంది.తమలపాకు అనేది బుధ గ్రహానికి సంబంధించినదని పండితులు చెబుతున్నారు.
ఇంకా చెప్పాలంటే జాతకంలో బుధ గ్రహం బాగుంటే అనేక ప్రయోజనాలు ఉంటాయి.అలాగే బుధుడు తెలివితేటలకు, ఆరోగ్య సిద్ధికి కారణం అని నిపుణులు చెబుతున్నారు.
అలాగే వృత్తి వ్యాపారాలలో విజయం సాధించాలంటే బుధుడు అనుకూలంగా ఉండాలి.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం తమలపాకును దిండు కింద పెట్టుకుని నిద్రపోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే ఇలా నిద్ర పోతే మానసిక ప్రశాంతత కలుగుతుంది.అంతే కాకుండా ప్రశాంతమైన నిద్ర కూడా పడుతుంది.నిద్ర సంబంధిత సమస్య( Sleeping Problems )లతో బాధపడేవారు దిండు కింద తమలపాకు పెట్టుకొని నిద్రపోవడం మంచిది.అంతే కాకుండా శరీరంలోని, ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది.
ముఖ్యంగా చెప్పాలంటే గంగాజలం లేదా తులసి నీటిలో తమలపాకు ఉంచి ఆ తర్వాత ఎర్రటి వస్త్రంలో కట్టి దిండు కింద పెట్టుకోవాలి.ఇలా చేస్తే ఈ రెమిడీ ఎంతో ప్రభావంతంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే మానసిక ధైర్యాన్ని కూడా పెంచుతుందని చెబుతున్నారు.