జీవితంలో ఒక్కోసారి తీసుకునే నిర్ణయాలు ఎంతటి ప్రమాదంలోకి నెడతాయో చెప్పడానికి ఇదో ఉదాహరణ.నెలకు లక్షన్నర జీతం సంపాదిస్తున్న ఓ 42 ఏళ్ల వ్యక్తి, స్టాక్ మార్కెట్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో( Options Trading ) చేసిన పొరపాట్ల వల్ల ఏకంగా రూ.62 లక్షల అప్పుల్లో కూరుకుపోయాడు.ఈ విషయాన్ని తనే స్వయంగా రెడ్డిట్ అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో పంచుకుంటూ తన ఆవేదనను వెళ్లగక్కాడు.ఇప్పుడు ఆ అప్పుల నుంచి ఎలా బయటపడాలో తెలియక, ఆశలన్నీ కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్నానని వాపోయాడు.
“స్టాక్ మార్కెట్( Stock Market ) ఆప్షన్స్‌లో పెట్టుబడి పెడితే బోలెడు లాభాలు వస్తాయని ఆశపడ్డాను.దానికోసం చాలా లోన్లు తీసుకున్నాను.కానీ నేను ఊహించినదానికి భిన్నంగా జరిగింది.భారీ నష్టాలు వచ్చాయి.ఇప్పుడు ట్రేడింగ్ చేయడం పూర్తిగా ఆపేశాను.
కానీ చేసిన తప్పు నన్ను వెంటాడుతోంది.తీవ్రమైన అపరాధభావంతో కుమిలిపోతున్నాను.
భవిష్యత్తుపై ఆశ లేదు” అని అతను తన పోస్టులో రాశాడు.

“నా జీతం రూ.1.5 లక్షలు అయినా, అందులో ఎక్కువ భాగం లోన్ల ఈఎంఐలకే పోతోంది.ఇంటి ఖర్చులకు, నలుగురు సభ్యులున్న కుటుంబాన్ని (భార్య, 10, 6 ఏళ్ల ఇద్దరు పిల్లలు) పోషించడానికి కేవలం రూ.20,000 మాత్రమే మిగులుతున్నాయి.దీంతో కుటుంబాన్ని నెట్టుకురావడం చాలా కష్టంగా మారింది” అని తన దీనస్థితిని వివరించాడు.
అతను తీసుకున్న అప్పుల వివరాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.క్రెడిట్ కార్డులపై బాకీ రూ.12 లక్షలు, వ్యక్తిగత రుణాలు ( Personal Loans ) రూ.25 లక్షలు, గృహ రుణం ( Home Loan ) రూ.25 లక్షలు, మొత్తం కలిపి రూ.62 లక్షల భారీ రుణం.ఈ అప్పులన్నీ తీర్చడానికి కనీసం మరో ఐదేళ్లు పడుతుందని, ఈ ఐదేళ్లు ఎలా గడుస్తాయో, అసలు ఈ ఊబిలోంచి బయటపడగలనో లేదోనని భయంగా ఉందని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈ ఆర్థిక ఒత్తిడి వల్ల తీవ్రమైన మానసిక వేదన అనుభవిస్తున్నానని, ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉంటున్నానని, ఎప్పుడూ గతంలో చేసిన తప్పుల గురించే ఆలోచిస్తూ బాధపడుతున్నానని చెప్పాడు.ఇలాంటి కథలు ఇంకెన్నో ఉన్నాయి.అతని పోస్ట్ చూసి చాలా మంది నెటిజన్లు స్పందించారు.కొందరు ధైర్యం చెబుతూ కామెంట్లు పెట్టారు.ఈ క్రమంలోనే ఓ మహిళ తన కథను పంచుకుంది.
“మా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది.మా మామగారు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల నా భర్త ఏకంగా రూ.2 కోట్ల అప్పుల్లో కూరుకుపోయారు.వచ్చే నెల ఉండటానికి ఇల్లు ఉంటుందో లేదో కూడా తెలియని పరిస్థితి.అయినా, మా దురదృష్టాన్ని చూసి మేమే నవ్వుకోవడం నేర్చుకున్నాం.చాలా రకాల వ్యాపారాలు ప్రయత్నిస్తున్నా ఏదీ కలిసి రావడం లేదు” అని ఆమె చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఈ కష్టకాలంలో అతనికి ధైర్యం చెబుతూ, పలువురు రెడ్డిట్ యూజర్లు కొన్ని ప్రాక్టికల్ సలహాలు కూడా ఇచ్చారు.
బజాజ్ (Bajaj), టాటా క్యాపిటల్ (Tata Capital) వంటి సంస్థలు ఇచ్చే ‘డెట్ కన్సాలిడేషన్ లోన్’ గురించి ప్రయత్నించమని ఒకరు సూచించారు.దీని ద్వారా చాలా చిన్న చిన్న లోన్లను కలిపి ఒకే పెద్ద లోన్‌గా మార్చుకోవచ్చు.
దీనివల్ల నెలవారీ EMI భారం తగ్గే అవకాశం ఉంటుంది.ఈ పోస్ట్ స్టాక్ మార్కెట్‌లో, ముఖ్యంగా ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఉండే రిస్క్‌ను తెలియజేస్తుంది.
సరైన అవగాహన లేకుండా, అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెట్టడం ఎంత ప్రమాదకరమో హెచ్చరిస్తోంది.