ఒత్తిడిని చిత్తు చేసే కాఫీ స్మూతీ.. రోజూ తీసుకుంటే మ‌రెన్నో బెనిఫిట్స్‌!

ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి లోనవుతుంటారు.ఒత్తిడికి గురైనప్పుడు మైండ్ అస్సలు పనిచేయదు.

 This Coffee Smoothie Helps To Reduce Stress Very Quickly , Coffee Smoothie,-TeluguStop.com

ఏ పని పైన శ్రద్ధ పెట్టలేకపోతుంటారు.పొరపాటున ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే డిప్రెషన్ కు దారి తీస్తుంది.

అందుకే ఒత్తిడిని చిత్తు చేయాలి.అందుకు కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.

అటువంటి వాటిల్లో ఇప్పుడు చెప్పబోయే కాఫీ స్మూతీ( coffee smoothie ) ఒకటి.ఈ స్మూతీని ఒక్కసారి ట్రై చేస్తే మళ్లీ వదిలిపెట్టరు.

మరి ఇంకెందుకు ఆలస్యం కాఫీ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Coffee Smoothie, Tips, Latest, Stress, Stress Smoothie-Telugu Health

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఓట్స్( Oats )వేసి వాటర్ పోసి అరగంట పాటు నానపెట్టుకోవాలి.ఆ తర్వాత వాటర్ ను తొలగించి ఓట్స్ ను పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్, ఐదు నైట్ అంతా నానబెట్టుకున్న జీడిపప్పు, నానబెట్టుకున్న ఓట్స్, వన్ టేబుల్ స్పూన్ పీన‌ట్ బటర్, రెండు గింజ తొలగించిన ఖర్జూరాలు,( Dates ) ఒక అరటిపండు, వన్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్( Chia seeds ) మరియు ఒక గ్లాసు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Coffee Smoothie, Tips, Latest, Stress, Stress Smoothie-Telugu Health

తద్వారా మన కాఫీ ఓట్స్ స్మూతీ సిద్ధం అవుతుంది.ఒత్తిడికి గురైనప్పుడు ఈ స్మూతీని తీసుకుంటే చాలా వేగంగా రిక‌వ‌ర్‌ అవుతారు.మైండ్ రిఫ్రిష్ అవుతుంది.మనసు ప్రశాంతంగా మారుతుంది.పనిపై ఏకాగ్రత రెట్టింపు అవుతుంది.డిప్రెషన్ తో బాధపడేవారు ఈ కాఫీ స్మూతీని తీసుకుంటే ఆ సమస్య నుంచి త్వరగా బయటపడతారు.

అంతేకాదు వెయిట్ లాస్ కు ఈ స్మూతీ సహాయపడుతుంది.రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఈ స్మూతీని చేర్చుకుంటే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.

చిరు తిండ్లపై మనసు మళ్లకుండా ఉంటుంది.అదే సమయంలో మెటబాలిజం రేటు పెరుగుతుంది.

దాంతో వెయిట్ లాస్ అవుతారు.అలాగే ఈ కాఫీ స్మూతీని రోజూ తీసుకుంటే నీర‌సం, అల‌స‌ట ద‌రి చేర‌కుండా ఉంటాయి.

గుండెకు ముప్పు సైతం త‌గ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube