ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో డేటింగ్ కల్చర్( Dating ) జోరుగా కొనసాగుతుంది.గాసిప్స్ రావడం సర్వసాధారణమైన ఖచ్చితమైన సమాచారం లేక చాలా జంటలు డేటింగ్ కి వెళ్ళారా లేదా అనే కన్ఫ్యూషన్ లో ఉంటారు లేదా లవ్ చేసుకున్నారా లేదా అనే కన్ఫ్యూషన్ ప్రేక్షకులకు ఉండిపోతుంది.
కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే జంటలు అలా కాదు వీరు చాలా ఓపెన్ గా తాను లవ్ లో ఉన్నామనే విషయాన్ని చెప్పేస్తున్నారు.మరి అలా ప్రేమ పక్షుల విహరిస్తున్న ఆ తెలుగు హీరో హీరోయిన్స్ ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
సిద్ధార్థ్ మరియు అదితి రావ్

సిద్ధార్థ( Siddhartha ) మరియు అదితి రావు( Aditi Rao ) చాలా రోజులుగా ప్రేమలో ఉన్న విషయం మనందరికీ తెలిసింది మొదట్లో వీరు తాము ప్రేమలో ఉన్న విషయాన్ని ఖండించారు.కానీ ఆ తర్వాత రెస్టారెంట్స్ లో, పబ్లిక్ ఈవెంట్స్ లో చేతిలో చేయి వేసుకొని కనిపిస్తూ ఉండడంతో ఒప్పుకోక తప్పలేదు.అతి త్వరలోనే మీరు పెళ్లి చేసుకున్న కూడా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.ప్రస్తుతం వీరిద్దరూ తెలుగు మరియు బాలీవుడ్ లో కొన్ని ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు.
విజయ్ దేవరకొండ మరియు రష్మిక

వీరిద్దరూ కలిసి గీతా గోవిందం( Geeta Govindam ) అనే సినిమాలో తొలిసారి నటించారు.ఈ సినిమాలో వీరికి కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో ఆ తర్వాత కూడా కలిసి నటించారు అయితే గీతా గోవిందం చిత్రం నుంచి వీరి మధ్య బయటకు చెప్పలేని ఏదో ఒక రిలేషన్ నడుస్తుందని సర్వత్రా వార్తలు వినిపించాయి.ఇద్దరు కూడా తమపై వస్తున్న వార్తలను అయితే ఖండిస్తున్నారు.కానీ వీరిద్దరూ పక్కగా డేట్ లో ఉన్నారనే విషయం అభిమానులకు తెలుసు.వీరిద్దరూ ఎంత రహస్యంగా రిలేషన్ నడిపించిన వీరిద్దరూ ప్రస్తుతం ప్రేమలోనే ఉన్నారు.
విజయ్ వర్మ మరియు తమన్న

లస్ట్ స్టోరీస్ లో( Lust Stories ) తొలిసారి కలిసిన నటించిన ఈ జంట అప్పటినుంచి ప్రేమలో మునిగి తేలుతున్నారు.ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ జంట గురించి చర్చ సాగుతోంది.పైగా వీరు ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళుతూ ఒకే కారులో ప్రయాణిస్తూ వారి ప్రేమ సందేశాన్ని చెప్పకనే .చెబుతున్నారు.