ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ప్రజలలో చక్కర వ్యాధి అనేది సర్వసాధారణం అయిపోయింది.ఎందుకంటే ఈ చక్కెర వ్యాధి అనేది ఈ మధ్య కాలంలో చాలా కారణాల వల్ల వస్తుంది.
రోడ్లు, మాల్స్, అమ్యూల్మెంట్ పార్కులలో లేజర్ కిరణాలు భవనాల్లో వెలుగుతున్న ఎల్ఈడీ లైట్ల వల్ల కూడా మధుమోహం వచ్చే అవకాశం ఉందని తాజా అధ్యయనాలలో తెలిసింది.ఒక తాజా పరిశోధన ప్రకారం రాత్రి పూట కృతిమ బహిరంగ కాంతి శరీరంలోని హార్మోన్ల పనితీరును ఎంతో సులభంగా ప్రభావితం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇది మధుమోహం ముప్పును మరింత పెంచే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.రక్తంలోని చక్కెర స్థాయి పెరిగితే కిడ్నీ,గుండె వంటి కీలకమైన అవయవాలపై ఒత్తిడి పెరిగి దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.
ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారం చైనాలోని షాంగై లోని జియాతోంగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో Lan మరియు డయాబెటిస్ రిస్క్ మధ్య సంబంధాన్ని తెలుసుకున్నారు.స్కై లైట్లను కృత్తిమంగా ప్రకాశవంతం చేయడం వల్ల చక్కెర వ్యాధి వచ్చే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తెలిసింది.
ఈ ఎల్ ఈ డి లైట్ల వల్ల ఎక్కువగా ప్రభావితమైన మనిషి శరీరంలో హార్మోన్లు మారుతూ ఉంటాయి.దీనివల్ల మేలాటోనీన్ మరియు కార్టికోస్టిరాన్ వేరువేరుగా పనిచేస్తూ ఉంటాయి.
ఇవి నిద్రపోవడానికి మరియు ఉదయం మేల్కొనడానికి ఎంతో సహాయపడతాయి.
ఫలితంగా శరీరంలో చక్కెర ఉత్పత్తి పెరిగే అవకాశం ఉంది.రాత్రిపూట నియాన్ లేదా ఎల్ఈడి లైట్ కి గురికాకుండా జీవక్రియ మందగిస్తుంది అని అధ్యయనాలు చెబుతున్నాయి.అంటే రాత్రి పగలు అనే తేడా శరీరానికి ఏమీ లేకుండా పగటిపుట విడుదలయ్యే కార్టిసాల్ రాత్రిపూట కూడా విడుదలవుతూ ఉండడం వల్ల శరీరంలో చక్కెర స్థాయి పెరిగే అవకాశం ఉంది.