జీర్ణశక్తికి, పైత్యానికి దివ్యౌషధం.. జీలకర్ర

జీలకర్ర ఇది మనం రోజువారి వాడే వంటల్లో వినియోగిస్తూ ఉంటాం.అసలు జీలకర్ర ని నిత్య వస్తువుగా ఎందుకు చేర్చారు వాటి ఉపయోగం ఏమిటి అనేది మనలో చాలా మందికి తెలియదు.

 Cumin Water Gives You More Health Benefits Details, Cumin, Cumin Water, Cumin Wa-TeluguStop.com

జీలకర్రతో పోపు పెడుతారు అనే విషయం మాత్రమే మనకి తెలుసు.కానీ జీలకర్ర తో ఎన్నో లాభాలు ఉన్నాయి.

జీలకర్రని కొంచం తీసుకుని ఒక గ్లాసు నీటిలో ఉంచి వేడి చేయాలి.తరువాత వచ్చిన నీటిని గోరువెచ్చగా ఉనప్పుడు తీసుకోవాలి.

ఇలా చేయడం వలన జీర్ణ సంభందిత వ్యాధులు నయమవుతాయి.

జీలకర్ర నీటిని త్రాగడం వలన కడుపులో ఉన్న పరుగులు చనిపోతాయి.

డయాబెటిక్ పేషెంట్లకు జీలకర్ర నీరు మంచి ఔషధం.రోజు తాగితే రక్తంలోని షుగర్ స్థాయిలు తగ్గుతాయి.

ఆకలి లేకుండా కడుపులో మందంగా ఉన్న వాళ్ళు ఈ నీటిని త్రాగితే మంచి ఫలితం కనపడుతుంది.జీలకర్రని దోరగా వేయించి మెత్తగా దంచి కొంచం ఉప్పు కలిపి రోజు అన్నం లో తీసుకుంటే జీర్ణ భాదలు శక్తి పెరుగుతుంది.

గర్భాశయ భాదలు తగ్గుతాయి.

అంతేకాదు జీలకర్రని నిమ్మరసం, కొంచం ఉప్పు లో కలిపి ఉదయం, రాత్రిళ్ళు తింటే కడుపులో తిప్పడం, వేడిని తగ్గించడం, పైత్యం తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.తేలు కుట్టిన వాళ్ళు కొంచం జీలకర్ర, తేనే, ఉప్పు, నెయ్యి, కలిపి నూరి తేలు కుట్టిన చోట ఉంచితే విషం హరిస్తుంది.నీరసం, పైత్యం, కాళ్ళ నెప్పులతో భాదపడే వాళ్ళు జీలకర్ర మరియు ధనియాలు కలిసిన మిశ్రమాన్ని రోజుకు ఒక సారి తీసుకుంటే ఈ భాదల్ని దూరం చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube