రక్తహీనత. పురుషులతో పోలిస్తే స్త్రీలలోనే ఈ సమస్య అధికంగా కనిపిస్తుంది.అందుకు ఎన్నో కారణాలు ఉన్నాయి.పోషకాహార లోపం, నెలసరి, ప్రెగ్నెన్సీ, వయసు పై పడటం తదితర కారణాల వల్ల స్త్రీలు రక్తహీనత బారిన పడుతుంటారు.హలో లేడీస్.మీరు కూడా రక్తహీనతతో బాధపడుతున్నారా? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను మీ డైట్ లో కనుక చేర్చుకుంటే రక్తహీనత పరార్ అవ్వడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ఏంటో.
దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.
వాటర్ హీట్ అయ్యే లోపు మరో గిన్నెను తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు రాగి పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ మరియు వాటర్ వేసుకుని లూజ్ స్ట్రక్చర్ లో మిక్స్ చేసుకోవాలి.ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని మరుగుతున్న వాటర్ లో వేసి ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించాలి.
అనంతరం అందులో రెండు టేబుల్ స్పూన్లు ఖర్జూరం పేస్ట్ వేసి మరో రెండు నిమిషాల పాటు ఉడికించాలి.
చివరిగా ఒక చిన్న కప్పు హోం మేడ్ బాదం పాలను పోసి ఒక నిమిషం పాటు హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే రక్తహీనతను తరిమికొట్టే రాగి ఆల్మండ్ డ్రింక్ సిద్ధం అవుతుంది.రోజుకు ఒక గ్లాస్ చొప్పున ఈ డ్రింక్ ను తీసుకుంటే శరీరానికి అవసరమయ్యే ఐరన్ తో సహా మరెన్నో పోషకాలు లభిస్తాయి.దీంతో రక్తహీనత దూరం అవుతుంది.
అలాగే ఈ రాగి ఆల్మండ్ డ్రింక్ ను తీసుకోవడం వల్ల స్త్రీలలో నీరసం, అలసట వంటివి దూరం అవుతాయి.ఎముకలు దృఢంగా మారతాయి.
మరియు ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల స్త్రీలలో పలు రకాల క్యాన్సర్లు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.