మనలో చాలా మంది కంటి ఆరోగ్యం( Eye health ) విషయంలో అజాగ్రత్తగా ఉంటారు.కానీ, మన శరీరంలోని కంటి చూపు అనేది అనేది అత్యంత ముఖ్యమైన భావేంద్రియాలలో ఒకటి.
మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గ్రహించడానికి, దాని అందాలను ఆస్వాదించడానికి, రోజువారీ కార్యకలాపాలకు కంటి చూపు చాలా కీలకం.వయస్సు పెరిగేకొద్దీ కంటి చూపు తగ్గుతూ రావొచ్చు.
అందుకే కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలు కలిగిన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి.అయితే కంటి ఆరోగ్యానికి అండగా నిలిచే ఆకుకూరలు కొన్ని ఉన్నాయి.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోజూవారీ వంటల్లో వాడే కరివేపాకు( curry leaves ) కంటి ఆరోగ్యానికి అత్యంత శ్రేష్టకరం.
కరివేపాకులో బీటా-క్యారోటిన్, విటమిన్ ఎ( Beta-carotene, vitamin A ) ఎక్కువగా ఉంటాయి.ఇవి కంటి చూపును మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి.కంటి ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో పాలకూర ఒకటి.విటమిన్ వి, ల్యూటిన్, జీయాక్సంతిన్ పాలకూరలో సమృద్ధిగా ఉంటాయి.
ఇవి రెటీనాను రక్షించడంతో తోడ్పతాయి.అలాగే కంటి కండరాలను బలపరిచి, కంటి అలసటను తగ్గిస్తాయి.
డ్రై ఐ సిండ్రోమ్ ( Dry eye syndrome )ను దూరం చేయడంలోనూ పాలకూర హెల్ప్ చేస్తుంది.

మంచి కంటి చూపు కోసం బచ్చలి కూరను( Spinach ) ఆహారంలో భాగం చేసుకోండి.ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి మరియు కాల్షియం బచ్చలి కూరలో ఎక్కువగా ఉంటాయి.బచ్చలి కూర కంటి చూపును పదునుగా ఉంచుతుంది.
హానికరమైన యూవీ అండ్ బ్లూ లైట్ రేడియేషన్ నుంచి కంటిని కాపాడుతుంది.

కంటి ఆరోగ్యానికి అండంగా నిలిచే ఆకుకూరల్లో గోంగూర ( Gongura )కూడా ఒకటి.విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నందున గోంగూర కంటి కణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది.క్త ప్రసరణను మెరుగుపరిచి, కంటికి తగినంత ఆక్సిజన్ ను అందిస్తుంది.
గోంగూరలో యాంటీ ఆక్సిడెంట్లు వివిధ కంటి వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.







