స్వీట్ కార్న్( Sweet corn ) నీ చూడగానే ఎవరికైనా నోరు ఊరుతుంది అని ఖచ్చితంగా చెప్పవచ్చు.వేడివేడిగా కాల్చిన స్వీట్ కార్న్ అయినా లేదా ఉడికించిన స్వీట్ కార్న్ ఆయన చాలామందికి తినాలనిపిస్తుంది.
రుచిలోనే కాదు పోషకాలలోనూ స్వీట్ కార్న్ ఎంతో మంచిది.ఇందులో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
అందువల్ల స్వీట్ కార్న్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.కేలోరీలు తక్కువగా ఉండే స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మొక్కజొన్న మీ శరీరానికి జీర్ణ వ్యవస్థకు ( digestive system )ఎంతగానో మేలు చేస్తుంది.ఇది జీర్ణ క్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది.ఎందుకంటే ఇందులో పొట్టకు మేలు చేసే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.అందువల్ల తరచుగా మొక్కజొన్న తింటే మీ కడుపు శుభ్రంగా ఉంటుంది.కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి స్వీట్ కార్న్ ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇందులో కన్నుల ఆరోగ్యానికి మేలు చేసే ల్యూటిన్( Lutein ) ఎక్కువగా ఉంటుంది.
స్వీట్ కార్న్ తినడం ద్వారా మీ కంటి చూపు మెరుగుపడుతుంది.

అలాగే కంటికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే మొక్కజొన్న తినడం ఎంతో మంచిది.స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల బరువు సులభంగా తగ్గుతారు.ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.
ఇది మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.దీనివల్ల మీకు పదేపదే ఆకలిగా అనిపించదు.
ముఖ్యంగా చెప్పాలంటే రక్తంలో చక్కెరను స్వీట్ కార్న్ తగ్గిస్తుంది.స్వీట్ కార్న్ రోజు తీసుకుంటే మధుమేహం అదుపులో ఉంటుంది.
మీకు రక్తంలో చక్కెర సమస్య( Sugar ) ఉంటే మొక్కజొన్న తినవచ్చు.మొక్కజొన్నలో ఏ బి విటమిన్లు చురుకుతనాన్ని పెంచుతాయి.
పోలేట్ గుండె సంబంధిత సమస్యలను అదుపులో ఉంచుతుంది.ఇంకా చెప్పాలంటే మొక్కజొన్న గింజల లో ఫెరులిక్ యాసిడ్ క్యాన్సర్ కి అడ్డుకట్ట వేస్తుంది.