కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) ఉన్నన్ని రోజులు ఆ దేశంతో ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే.ఖలిస్తాన్ వేర్పాటువాది, ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉందంటూ ట్రూడో చేసిన వ్యాఖ్యలతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు తెగిపోయాయి.
ఒకానొక దశలో భారత ప్రభుత్వం కెనడాలో( Canada ) వీసా ప్రాసెస్ కేంద్రాన్ని మూసివేసింది.అయితే తర్వాత మనసు మార్చుకుని పునరుద్ధరించింది.
వివాదం సద్దుమణిగింది అనుకుంటున్న దశలో నిజ్జర్ హత్య కేసు అనుమానితుల్లో కెనడాలోని భారత హైకమీషనర్ పేరును చేర్చడంతో మోడీ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.

అలాగే నిజ్జర్ హత్య జరిగి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏకంగా పార్లమెంట్‌లో నివాళి అర్పించడంతో అంతర్జాతీయ సమాజం నుంచి కెనడాపై తీవ్ర విమర్శలు వచ్చాయి.ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కెనడా ప్రధాని పదవికి జస్టిన్ ట్రూడో రాజీనామా చేసి ఆయన స్థానంలో మార్క్ కార్నీ( Mark Carney ) వచ్చారు.అయితే ఆయన కుదురుకోకుండానే కెనడాలో మధ్యంతర ఎన్నికలు వచ్చాయి.
త్వరలో ఏర్పడే కొత్త ప్రభుత్వం భారత్‌తో సంబంధాల విషయంలో ఎలా వ్యవహరిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

ఒకప్పుడు న్యూఢిల్లీలో పనిచేసిని రిటైర్డ్ కెనడియన్ దౌత్యవేత్త ఒకరు.కెనడాలో ఏర్పడే కొత్త ప్రభుత్వం భారత్‌తో( India ) సంబంధాలు పెట్టుకోవాలని సూచించారు.ఆసియా పసిఫిక్ ఫౌండేషన్ ఆఫ్ కెనడాలో సీనియర్ ఫెలో అయిన డేవిడ్ మెకిన్నన్ 2017 నుంచి 2022 వరకు శ్రీలంక , మాల్దీవులకు హైకమీషనర్‌గా వ్యవహరించారు.
అంతకుముందు 2004 నుంచి 2009 వరకు న్యూఢిల్లీలోని కెనడా హైకమీషన్‌లో మినస్టర్ కౌన్సెలర్‌గా పనిచేశారు.
ఫౌండేషన్ కోసం పంపిన ఆయన పంపిన ప్రకటనలో .ఏప్రిల్ 28 ఎన్నికల తర్వాత కెనడాలో ఏర్పడే కొత్త ప్రభుత్వం భారత్‌తో సమర్థవంతంగా , ఆచరణాత్మకంగా సంబంధాలు కొనసాగించాలని సూచించారు.కెనడా ఆర్ధిక, భద్రత అంశాల భారత్ అత్యంత కీలకమైనదని .దానిని విస్మరించకూడదని డేవిడ్ అన్నారు.భారత్ ఇప్పుడు ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధ అని .20 ఏళ్ల క్రితం కెనడా కంటే చిన్నగా ఉండే భారత్ ఇప్పుడు రెండింతలు పెరిగిందన్నారు.