హలో లేడీస్.. మీ కిచెన్ లో ఈ టిప్స్ ను పాటిస్తున్నారా..?

ఆడవారు ఇంట్లో ఎక్కువ సమయం గడిపేది కిచెన్ లోనే అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఉదయం లేచింది మొదలు నైట్ నిద్రపోయే వరకు కిచెన్ లో కుకింగ్, క్లీనింగ్ ఇలా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు.

 Hello Ladies Are You Following These Tips In Your Kitchen Details, Kitchen Tips,-TeluguStop.com

అయితే వంటింట్లో ఉండే లేడీస్ కి( Ladies ) ఇప్పుడు చెప్పబోయే టిప్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఈ టిప్స్ మీ పనులను సులభతరం చేస్తాయి.

మరి లేటెందుకు ఆ కిచెన్ టిప్స్( Kitchen Tips ) ఏంటో తెలుసుకుందాం పదండి.

దాదాపు అందరి ఇంట్లో వారానికి ఒకసారైనా చపాతీ లేదా పూరీలను బ్రేక్ ఫాస్ట్ గా చేస్తూ ఉంటారు.

అయితే గోధుమ పిండిలో( Wheat Flour ) కొద్దిగా బియ్యం పిండి లేదా బొంబాయి రవ్వ వేసి చేస్తే పూరీలు చక్కగా పొంగుతాయి.చపాతీ( Chapathi ) మెత్తగా తెల్లగా ఉండాలంటే పిండిలో ఒక స్పూన్ బియ్యం పిండి, రెండు మూడు స్పూన్లు పాలు మరియు ఒక స్పూన్ నూనె వేసి కలపాలి.

Telugu Chapathi, Kitchen, Kitchen Tips, Latest, Salt, Vegetables, Vinegar-Telugu

వెల్లుల్లి పాయలకు కొంచెం వైట్ వెనిగర్ ను రాసి స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి.అలాగే ఒక్కోసారి ఆమ్లెట్( Omelette ) వేస్తే పెనానికి అంటుకుపోయి మిస్సీగా మారుతుంది.అయితే ఆమ్లెట్ వేసే ముందు పెనంపై ఉప్పు( Salt ) జల్లి తుడవాలి.ఇలా చేస్తే పెనానికి ఆమ్లెట్ ఏ మాత్రం అంటుకోదు.

Telugu Chapathi, Kitchen, Kitchen Tips, Latest, Salt, Vegetables, Vinegar-Telugu

కూరగాయలు వండేటప్పుడు పాత్ర పై మూత ఉంచాలి.మూత ఉంచడం వల్ల కూరగాయలు( Vegetables ) త్వరగా ఉండకడమే కాకుండా పోషకాలు సైతం వేరు కాకుండా ఉంటాయి.వారానికి సరిపడా ఇడ్లీ పిండిని రుబ్బుకుని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అలవాటు చాలా మందికి ఉంటుంది.ఒక్కోసారి ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ఇడ్లీ పిండి ఫుల్ల‌గా తయారవుతుంది.

అయితే ఇడ్లీ పిండిలో చిన్నపాటి అరటి ఆకు వేసి ఉంచండి.ఇలా చేస్తే ఇడ్లీ పిండి పులిపెక్కకుండా ఉంటుంది.

వంట పాత్రలు తళతళ మెరవాలంటే ఒక టబ్ లో నీళ్లు పోసి అర కప్పు వెనిగర్ కలపాలి.ఆ వాటర్ లో రాత్రంతా పాత్రలు నానబెట్టి ఉదయాన్నే తోమితే పాత్రలు చక్కగా మెరుస్తాయి.

అల్లం, వెల్లుల్లి, ఉల్లి వంటివి కట్ చేసినప్పుడు చేతులు అదోరకమైన వాసన వస్తుంటాయి.అలాంటి సమయంలో కాఫీ పొడిని చేతిలో వేసుకుని బాగా రుద్ది వాటర్ తో వాష్ చేసుకోవాలి.

ఇలా చేస్తే వాస‌న పోతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube