చంపుతామని బెదిరిస్తున్నారు... సింగర్ సునీత వల్లే ఇదంతా: ప్రవస్తి 

పాడుతా తీయగా(Paadutha Theeyagaa) కార్యక్రమం ఎస్పీ బాలసుబ్రమణ్యం 1996లో ప్రారంభించారు.అప్పటి నుంచి ఈ షో సక్సెస్ ఫుల్ గా ముందుకు వెళుతుంది.

 Threatening Calls Came From Un Know Persons Pravasti Comments Viral Details, Pra-TeluguStop.com

అయితే బాలసుబ్రమణ్యం గారి మరణించిన తర్వాత కొద్ది రోజులపాటు ఈ కార్యక్రమాన్ని ఆపివేశారు.ఇక బాలసుబ్రమణ్యం గారి మరణం తర్వాత ప్రస్తుతం ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఇటీవల కంటెంట్ గా పాల్గొన్న సింగర్ ప్రవస్తి (Pravasti) ఎలిమినేట్ అయిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈమె ఎలిమినేట్ కావడంతో పాడుతా తీయగా షో గురించి సంచలన మైనటువంటి ఆరోపణలు చేస్తూ వీడియో వదిలారు.

Telugu Pravasthi, Pravasti, Sunitha-Movie

ఈ కార్యక్రమంలో జడ్జిలు చాలా పక్షపాతంగా వ్యవహరిస్తారని అందుకే తాను ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని తెలిపారు.ముఖ్యంగా సింగర్స్ సునీత (Sunitha) నా గురించి మిగతా ఇద్దరి జడ్జిలకు చెడుగా చెప్పటం స్వయంగా తానే విన్నానని ప్రవస్తి తెలిపారు.నేను ఈ షో నుంచి బయటకు రావడానికి సునీతనే కారణం ఆమె నా గురించి ఒక వీడియో విడుదల చేశారు.ఆ వీడియో తర్వాత నన్ను సపోర్ట్ చేసేవారు లేకపోవడంతోనే తాను ఎలిమినేట్ అయ్యానని తెలిపారు.

Telugu Pravasthi, Pravasti, Sunitha-Movie

ఈ షోలో జరిగినట్టుగా ఏ షోలోను జరగదు.ఈటీవీ నుంచి నాకు ఫోన్ వచ్చింది.మీరు ఎలిమినేట్ అవ్వాల్సింది కాదు అని మాత్రం చెప్పారు అంటే తప్పు జరిగిందనే కదా అర్థం.అందుకే నేను పోరాడుతున్నాను.సునీత ఆ వీడియోలో మా అమ్మ గురించి చెప్పారు.కానీ మా అమ్మ ఆవిడ దగ్గరికి వెళ్లి ఏమీ అనలేదు సునీతకు నాకు ట్రోఫీ ఇవ్వడం నచ్చలేదు అందుకే మా అమ్మ నన్ను అక్కడి నుంచి తీసుకురావడానికి మాత్రమే వచ్చింది.

ఈ షోలో పాటలు పాడాలి అంటే పాటలను మనమే సెలెక్ట్ చేసుకోమంటారు.మనం ఎన్ని సెలెక్ట్ చేసిన వాళ్లు రిజెక్ట్ చేస్తారు చివరికి వాళ్ళు చెప్పిందే మనం పాడాలి.

ఇలాంటి ఇబ్బందులు ఎవరు బయటకు చెప్పరు కానీ నేను బయట పెడుతున్నానని తెలిపారు.

ఇక ఈ షో గురించి నేను అన్ని విషయాలను బయట పెట్టడంతో బెదిరింపు ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయని తెలిపారు.

అయితే ఇప్పటివరకు నాకు ఇలాంటి ఫోన్ కాల్స్ రాకపోయినా నాకు తెలిసిన వారికి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు.ఇలా నన్ను ఎవరు భయపెట్టలేరు.ఇకపై నాకు అవకాశాలు రావని తెలుసు కానీ నన్ను నేను ప్రూఫ్ చేసుకుంటానని ప్రవస్తి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube