ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ స్త్రీలను అత్యధికంగా వేధించే సమస్యల్లో ఒత్తిడి ముందు వరసులో ఉంటుంది.కారణం ఏదైనా తరచూ ఒత్తిడికి గురైతే.
తల్లికే కాదు కడుపులోని శిశువుకు కూడా చాలా ప్రమాదమని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.అందుకే గర్భిణీలు ఒత్తిడికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని అంటుంటారు.
అయితే ఇప్పుడు చెప్ప బోయే నియమాలను గర్భిణీలు పాటిస్తే గనుక ఒత్తిడి దరి చేరనే చేరదు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ నియమాలు ఏంటో ఓ చూపు చూసేయండి.
ప్రెగ్నెన్సీ సమయంలో ఖాళీగా అస్సలు ఉండ కూడదు.ఖాళీగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు మదిలో మెదిలి.
చివరకు ఒత్తిడికి దారి తీస్తాయి.అందుకే గర్భిణీలు ఎప్పుడూ బిజీగా ఉండేందుకే ప్రయత్నించాలి.
వంటలు చేయడం, పెయింటింగ్, అల్లికలు, పాటలు పాడటం ఇలా ఏదో ఒక పని చేస్తూ ఉండాలి.
కంటి నిండా నిద్ర లేక పోయినా ఒత్తిడికి గరవుతారు.
అందు వల్ల, గర్భిణీలు ఎక్కువ విశాంత్రి తీసుకోవాలి.అప్పుడే తల్లీ మరియు కడుపులోని బిడ్డ యాక్టివ్‌గా ఉంటారు.

అలాగే గర్భిణీలు మసాలా ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, కెఫిన్ ఫుడ్స్, ఆల్కాహాల్, కూల్ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉంటూ సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి.
ఒత్తిడికి దూరంగా ఉండాలీ అనుకుంటే పుస్తకాలు చదవడం బెస్ట్ అప్షన్‌గా చెప్పుకోవచ్చు.అవును, ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీలు మంచి మంచి పుస్తకాలు చదివితే ఒత్తిడి దరి చేరకుండా ఉంటుంది.అందులోనూ ఆధ్యాత్మిక పుస్తకాలను చదివితే ఇంకా మంచిది.ఇక ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి మహిళా రోజుకు కనీసం పావు గంట అయినా మెడిటేషన్ చేయాలి.తద్వారా మెదడులో చెత్తంతా తొలగి పోతుంది.ఫలితంగా ఒత్తిడి దరి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.