హిందూ ధర్మం ( Hindu Dharmam ) ప్రకారం వంటగదికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.మనిషి జీవితానికి మూలమైన ఆహారం విషయంలో కూడా కొన్ని వాస్తు చిట్కాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
అందుకే భోజనం( meal ) చేసే సమయంలో కచ్చితంగా ఈ వాస్తు చిట్కాలను పాటించాలి.ఇంతకీ భోజనం విషయంలో ఎలాంటి వాస్తు చిట్కాలు పాటించాలి.
ఈ చిట్కాలను పాటించకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం( Goddess Lakshmi ) ఉండాలంటే అన్నపూర్ణాదేవిని ప్రసన్నం చేసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
ఇందుకోసం వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి.

ఇందులో భాగంగానే వీలైనంతవరకు రాత్రి భోజనం చేసిన తర్వాత పాత్రలను శుభ్రం చేసుకోవాలి.ఉదయం నిద్ర లేవగానే రాత్రి తిన్న పాత్రలను కడగకుండా వదిలేసిన పాత్రలను చూడకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఇక ఆహారం వండే సమయంలో కూడా కొన్ని జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
అయితే ఆహారం వండేటప్పుడు వంటగది శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.ముఖ్యంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే ఆహారాన్ని తయారు చేయాలి.
అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం దక్షిణాభి ముఖంగా ఆహారాన్ని ఎప్పుడు తయారు చేయకూడదు.ఆహారం వండడానికి ఉత్తరం లేదా తూర్పు దిక్కు శుభప్రదం అని పండితులు చెబుతున్నారు.

అంతేకాకుండా ఆహారాన్ని ఎప్పుడు కూడా వృధా చేయకూడదు.ఇలా ఆహారం వృధా చేయడం వల్ల కూడా ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.ఆహారం వృధా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.అందుకే వీలైనంత వరకు ఆహారాన్ని వృధా( Wasting food ) చేయకూడదు.ఒకవేళ ఆహారం మిగిలిపోతే పేదలకు పంచడం లాంటివి చేయాలి.అంతే కానీ చెత్తలో వేయకూడదని చెబుతున్నారు.
ఇక ఆహారం తిన్న వెంటనే పడుకోకూడదు అని కూడా వాస్తు నిపుణులు చెబుతున్నారు.ఇక తిన్న తర్వాత తిన్న ప్లేట్ లో చేతులు కడగడం వలన లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుందని పండితులు చెబుతున్నారు.