ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 6.06
సూర్యాస్తమయం: సాయంత్రం.6.25
రాహుకాలం: సా.4.30 ల6.00
అమృత ఘడియలు: మ.2.00 సా4.00
దుర్ముహూర్తం: సా.5.02 ల5.53
మేషం:

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
వృషభం:

ఈరోజు మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.దూరపు బంధువుల నుండి ఆహ్వానం అందుకుంటారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.లేదంటే ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మిథునం:

ఈరోజు మీరు కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండడం మంచిది.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.మీరంటే గిట్టని వారిని విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
కర్కాటకం:

ఈరోజు మీరు ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.మీరంటే గిట్టని వారు మీ విషయాలు తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
సింహం:

ఈరోజు సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా సమయానికి తిరిగి మీ చేతికి అందుతుంది.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకండి.
కన్య:

ఈరోజు మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయకపోవడమే మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.
వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తుల:

ఈరోజు మీరు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నూతన వస్తు బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.
వృశ్చికం:

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.సమాజంలో మంచి గౌరవ మర్యాదలను పొందుతారు.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.
పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
ధనుస్సు:

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని చెడు సవాసాలకు దూరంగా ఉండటమే మంచిది.దూరపు బంధువుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
మకరం:

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.కొన్ని చెడు సావాసాలకు దూరంగా ఉండటం మంచిది.ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి.
ఈరోజు మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.
కుంభం:

ఈరోజు మీరు ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగుతారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.కొన్ని ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.అనవసరంగా మీ విలువైన సమయాన్ని వృధా చేయకండి.
మీనం:

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.ఇతరుల నుండి మీ డబ్బు సమయానికి తిరిగి చేతికి అందుతుంది.
చాలా సంతోషంగా ఉంటారు
DEVOTIONAL