బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా కంటెస్టెంట్ గా ప్రేక్షకులకు పరిచయమైనటువంటి శుభ శ్రీ( Subha shree )ఈ కార్యక్రమం ద్వారా ఐదు వారాలపాటు హౌస్ లో కొనసాగీ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె అనూహ్యంగా 5వ వారం బయటకు వచ్చారు.స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి శుభ శ్రీ ఎలిమినేట్ అవుతారని అసలు ఊహించలేదు.
అయితే ఈమె ఐదవ వారం ఎలిమినేట్ అయినప్పటికీ తిరిగి వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపిస్తే బాగుండని చాలా మంది భావించారు.ఏం జరిగినా మన మంచికే అనే సామెత ఈమె విషయంలో సరిగ్గా సరిపోయిందని తెలుస్తుంది.

బిగ్ బాస్( Bigg Boss ) నుంచి ఐదవ వారమే బయటకు వచ్చారా అని బాధపడే క్రమంలోనే ఈమెకు పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న సినిమాలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.డైరెక్టర్ సుజిత్ ( Sujeeth ) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ( Pawan Kalya n) హీరోగా నటిస్తున్నటువంటి చిత్రం ఓజీ.ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.అయితే ఈ సినిమాలో శుభశ్రీ నటించిన అవకాశాన్ని సొంతం చేసుకున్నారు.ఇక ఇదే విషయాన్ని ఈమె తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

డైరెక్టర్ సుజిత్ తో శుభశ్రీ కలిసి దిగిన ఫోటోని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నిజంగా తనకు ఇలాంటి మంచి అవకాశం కల్పించినటువంటి డైరెక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.తనకెంతో ఇష్టమైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో నటించే అవకాశం రావడంతో ఈమె సంతోషం వ్యక్తం చేశారు తన టాలెంట్ పట్ల నమ్మకం ఉంచి తనకు ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ సుజిత్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
.






