వేసవి కాలం ప్రారంభం అయిపోయింది.మార్చి నెలలోనే ఎండలు ముదరడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
ఈ కాలంలో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండడం వల్ల చర్మ సౌందర్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.అందుకే సమ్మర్ సీజన్‌లో ఆరోగ్యమే కాదు చర్మ సంరక్షణ విషయంలోనూ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా తీవ్ర నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
అయితే సమ్మర్‌లో ఎండల నుంచి చర్మాన్ని రక్షించడంలోనూ, సన్ ట్యాన్ సమస్యను నివారించడలోనూ, సౌందర్యాన్ని పెంచడంలోనూ కొన్ని వెజిటెబుల్ ఫేస్ ఫ్యాక్స్ అద్భుతంగా సహాయపడతాయి.మరి అవేంటో లేట్ చేయకుండా ఓ లుక్కేసేయండి.
సమ్మర్‌లో క్యారెట్ ఫేస్ ప్యాక్ చర్మానికి చాలా మంచిది.క్యారెట్ తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి అందులో కొద్దిగా పెరుగు మరియు ఆలివ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసి ఇరవై నిముషాల తర్వాత గోరెవెచ్చని నీళ్లతో కడిగేయాలి.ఈ ప్యాక్ ఎండకు కమిలి పోయిన చర్మాన్ని మళ్లీ సాధారణ స్థితిలోకి తీసుకువస్తుంది.
మరియు సన్ ట్యాన్ సమస్యను దూరం చేస్తుంది.
అలాగే కీర దోస ఫేస్ ప్యాక్ కూడా ఈ వేసవి కాలంలో యూజ్ చేయడం చాలా మంచిది.కీర దోస నుంచి రసంలో తీసుకుని అందులో కొద్దిగా పాల పొడి మరియు ఎగ్ వైట్ వేసి కలుపుకోవాలి.ఈ మిశ్రమానికి ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.
పావు గంట తర్వాత గోరు వెచ్చని నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా తరచూ చేయడం వల్ల ఎండకు డ్రైగా మారిన పోయిన చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
సమ్మర్‌లో టమాటా ఫేస్ ప్యాక్ కూడా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.టమాటా గుజ్జును ఒక బౌల్‌లో వేసుకుని అందులో ముల్తానీ మట్టి మరియు పెరుగు వేసి కలపండి.
ఈ మిశ్రానికి ముఖానికి అప్లై చేసి అరగంట తర్వాత కూల్ వాటర్‌తో శుభ్రం చేసుకోవాలి.ఇలా చేయడం వల్ల మృతకణాలు పోయి అందంగా, ప్రకాశవంతంగా ముఖం పడుతుంది.
మరియు అధిక జిడ్డు సమస్య దూరం అవుతుంది.
.