సాధారణంగా చాలామంది పెద్దలు నరుడి దిష్టికి నాపరాయి అయినా ముక్కలవుతుందని చెబుతూ ఉంటారు.ఎందుకంటే నరదృష్టి కి అంత పవర్ ఉంటాయి.
ఇక కొన్ని కళ్ళు పాజిటివ్ ఎనర్జీని ఇస్తే మరికొన్ని కళ్ళు నెగిటివ్ ఎనర్జీ ఇస్తాయి.అయితే ఇంటికి కూడా దిష్టి తగులుతుంది.
అందుకే చాలామంది ఇంటికి దిష్టి తగలకుండా గుమ్మడికాయను కడుతూ ఉంటారు.అయితే గుమ్మడికాయ నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తితో కూడినది.
అందుకే గుమ్మడికాయను ఇంటి గుమ్మానికి కట్టేస్తాము.దీనివల్ల ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి.
అయితే ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు రాకుండా ఉండాలంటే, నర దిష్టి, నరఘోష( Nara Dishti, Naraghosha ) లాంటివి పోవాలంటే ఈ ఒక్క మొక్క చాలు.పాల తీగ మొక్క.
ఎలాంటి దుష్టశక్తులను కూడా ఇది మన ఇంటి ఆవరణలోకి కూడా రాకుండా చేస్తుంది.అంతేకాకుండా నరఘోష, నరదిష్టి, నర శాపం, కనుదిష్టి లాంటివి తగలకుండా ఈ మొక్క రక్షిస్తుంది.
అంతేకాకుండా ఎన్నో రకాల తాంత్రిక ఉపయోగాల కోసం కూడా ఈ మొక్కను వాడుతారు.అయితే ఈ పాలకు తీగా మొక్క మనలో చాలామందికి తెలిసి ఉండదు.
ఈ తీగను ఉపయోగించి సకల దిష్టి దోషాలు ఎలా తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మంగళవారం రోజు లేదా ఆదివారం రోజున ఏదైనా అమావాస్య రోజున ఈ మొక్కను మనం దిష్టి నివారణకు ఉపయోగించాలి.ఈ రోజుల్లో ఉదయాన్నే తలస్నానం చేసి ఈ మొక్క దగ్గరకు వెళ్లి భూమి నుంచి మూడు అడుగులపై ఉండే కొమ్మను కత్తిరించి తెచ్చుకోవాలి.అలాగే తెచ్చిన కొమ్మను ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టినట్టుగా అడ్డంగా కట్టుకోవాలి.
ఇలా చేయడం ద్వారా ఎలాంటి నరదిష్టి, చెడు ఘోష ఇంట్లోకి రాకుండా ఆ తీగ అడ్డుకుంటుంది.ఇలా చేయడం వలన ఇంట్లో ప్రతి ఒక్కరి మధ్య సఖ్యత ఉంటుంది.
అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అభివృద్ధి ఉంటుంది.

ఈ చిట్కాను పాటించడం వలన ఎలాంటి దిష్టి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి.అంతేకాకుండా ఈ చిట్కాను పాటించడం వలన మానసిక ఒత్తిడి కూడా దూరం అవుతుంది.అలాగే మనకు ప్రశాంతమైన జీవితం అందుతుంది.
ఎందుకంటే నరఘోష, నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఇంట్లో ఎప్పుడూ మానసిక ప్రశాంతత ఉండదు.ఆ ఇంట్లో సభ్యులు మానసిక ప్రశాంతతను కోల్పోయి చిరాకులతో జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
అలాంటి వారు ఈ పాలకు తీగను ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.