మూడున్నర సంవత్సరాల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా రూపొందిన ఎఫ్ 3 సినిమా మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.అనీల్ రావిపూడి పూర్తిగా కొత్త కమర్షియల్ కథతో ఈ సినిమాను రూపొందించాడు.
ఎఫ్ 2 కి ఎఫ్ 3 కి కథ పరంగా సంబంధం ఉండదు.కొన్ని పాత్రలు అందులోనివి ఇందులో కంటిన్యూ అయినట్లుగా అనిపిస్తూ ఉంటాయి.
అంతే తప్ప ఎఫ్ 3 కి ఎఫ్ 2 తో సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇవ్వడం జరిగింది.ఎఫ్ 3 కథ లో మళ్లీ వరుణ్ మరియు వెంకటేష్ లు హీరోయిన్స్ తో ప్రేమలో పడటం.
ఇద్దరు మళ్లీ ప్రేమ కోసం.డబ్బు కోసం ఆరాట పడటం వంటివి సినిమా లో చూడవచ్చు.
ఎఫ్ 3 లో ప్రథానంగా కథ డబ్బు చుట్టు తిరుగుతుందట.హీరోలు మరియు హీరోయిన్స్ కూడా డబ్బు సంపాదన కోసం అన్నట్లుగా తాపత్రయ పడుతూ అదుగో ఇదుగో అంటూ ఆరాటంతో హడావుడి చేస్తూ సందడి చేస్తారని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఎఫ్ 3 కథ చాలా విభిన్నంగా ఉండటంతో పాటు ఎఫ్ 2 కు మించిన నవ్వులు ఉంటాయని హామీ ఇస్తున్నారు.ఖచ్చితంగా ఇది ఒక అద్బుతమైన సినిమా అన్నట్లుగా ఉంటుందని అనీల్ రావిపూడి పదే పదే చెబుతున్నాడు.
గత సినిమా తో పోల్చితే ఈ సినిమా లో సునీల్ పాత్ర అదనంగా ఉండబోతుంది.

అంతే కాకుండా వెన్నెల కిషోర్ పాత్ర ను కూడా అదనంగా యాడ్ చేశారు.ఇక ఇద్దరు ముద్దుగుమ్మలు తమన్నా మరియు మెహ్రీన్ లతో పోల్చితే మరింత హాట్ గా ఉండే విధంగా సోనాల్ చౌహాన్ ను నటింపజేశాడు.కనుక ఈ సినిమా కచ్చితంగా ఫుల్ మాస్ ఎంటర్ టైన్మెంట్ ను అందిస్తుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.
ఈనెల 27న భారీ
ఎత్తున విడుదల కాబోతున్న ఎఫ్ 3 సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు.







