నెల రోజుల్లో స్ట్రెచ్ మార్క్స్ ను మాయం చేసే న్యాచురల్ క్రీమ్ ఇది.. తప్పక ట్రై చేయండి!

ప్రెగ్నెన్సీ( Pregnancy ) అనంతరం మహిళలు అత్యంత సర్వసాధారణంగా ఫేస్ చేసే సమస్యల్లో స్ట్రెచ్ మార్క్స్ ఒకటి.చర్మం వేగంగా సాగినప్పుడు లేదా కుంచించుకు పోయినప్పుడు స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతుంటాయి.

 This Natural Cream Helps To Get Rid Of Stretch Marks!, Natural Cream, Stretch Ma-TeluguStop.com

ముఖ్యంగా పొట్ట, పిరుదులు, ఛాతీ, చేతులు, తొడలపై ఇవి ఏర్పడుతుంటాయి.స్ట్రెచ్ మార్క్స్( Stretch Marks ) వల్ల ఆరోగ్యానికి వచ్చే నష్టం ఏమీ లేకపోయినా చర్మం మాత్రం చాలా అసహ్యంగా కనిపిస్తుంది.

అందుకే వీటిని వదిలించుకునేందుకు నానా తంటాలు పడుతుంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ క్రీమ్ చాలా బాగా సహాయపడుతుంది.

ఈ క్రీమ్ ను రెగ్యులర్ గా కనుక వాడారంటే నెల రోజుల్లో స్ట్రెచ్ మార్క్స్ మాయం అవుతాయి.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు వాసెలిన్ వేసుకోవాలి.అలాగే పావు టేబుల్ స్పూన్ అల్లం పొడి వేసుకుని రెండు కలిసేలా బాగా మిక్స్‌ చేసుకోవాలి.

Telugu Tips, Latest, Natural Cream, Skin Care, Skin Care Tips, Stretch, Stretchr

ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్( Apple Cider Vinegar ) మరియు వన్ టేబుల్ స్పూన్ విటమిన్ ఈ ఆయిల్ వేసుకుని మరోసారి మిక్స్ చేసుకోవాలి.తద్వారా మన క్రీమ్ అనేది సిద్ధం అవుతుంది.ఈ క్రీమ్ ను స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడిన చోట అప్లై చేసుకుని సున్నితంగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి.ఆపై చర్మాన్ని కనీసం గంట పాటు ఆరబెట్టుకుని అనంతరం గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి.

కావాలి అనుకుంటే మీరు ఈ క్రీమ్ నైట్ అప్లై చేసుకొని ఉదయాన్నే స్నానం కూడా చేయవచ్చు.నిత్యం ఈ క్రీమ్ ను వాడటం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.

Telugu Tips, Latest, Natural Cream, Skin Care, Skin Care Tips, Stretch, Stretchr

వాసెలిన్, అల్లం పొడి( Ginger Powder ), యాపిల్ సైడర్ వెనిగర్ మరియు విటమిన్ ఈ ఆయిల్ స్ట్రెచ్ మార్క్స్ కు వ్యతిరేకంగా పోరాడుతాయి.వాటిని క్రమంగా మాయం చేసి చర్మానికి మళ్లీ మునుపటి మెరుపును అందిస్తాయి.సాగిన చర్మాన్ని టైట్ గా మారుస్తాయి.స్ట్రెచ్ మార్క్స్ తో బాధపడుతున్న వారికి ఈ క్రీమ్ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.కాబట్టి తప్పకుండా తయారుచేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube