రాజబాబు చనిపోయే రోజు కాగితంపై రాసిన చివరి మాటలు తెలిస్తే కన్నీళ్లే.!

తెలుగు చలన చిత్ర రంగంలో హాస్యనటుల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు చెందిన నటుల్లో రాజబాబు కూడా ఒకరు.రెండు దశాబ్దాల పాటు సినిమా రంగంలో నటించి ప్రేక్షకులను నవ్వులతో ముంచేశారు.

 Raja Babu Last Wish Written In Paper, Rajababu, Rajababu Last Wish , Nagendrabab-TeluguStop.com

ఆయన నటనకు పేరు పెట్టాలిసిన పని లేదు.ఆ కాలంలో రాజబాబు లేని సినిమా లేదు.

దాదాపు 20 సంవత్సరాల కాలంలోనే 600పైగా చిత్రాల్లో నటించాడు.రాజబాబు దానాలు కూడా చేసేవాడు.

ఎంతో ఉదార స్వభావం గల గొప్ప నటుడు.ఆయన బ్రతికి ఉన్నన్నాళ్ళు ఆయన నవ్వుతు మనల్ని నవ్విస్తూ ఉండేవాడు.

మనిషికి నవ్వడంకి మించిన ఆనందం ఇంకోటి లేదు.అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు.

నవ్వడం ఒక భోగం.నవ్వించడం ఒక యోగం.

నవ్వలేక పోవడం ఒక రోగం అని.అలానే ఎదుటివాళ్ళని నవ్వించడం కూడా ఒక కళ.ఆ కళలో రాజబాబు ఆరి తేరారు.అలాంటి గొప్పనటుడు ఎలా చనిపోయాడు అనే విషయాలు చాలామందికి తెలియదు.

అలాంటి మహానుభావుడి చనిపోతూ కూడా తన మనసు ఏంటో చాటిచెప్పేలాగా ఒక పని చేసారు తెలుసా.అదేంటో తెలుసుకోండి.

రాజబాబు చనిపోయే సమయానికి ఆయన భార్యతో కాస్త విభేదాలు వచ్చాయి.అలాగే రాజబాబుకి నాగేంద్రబాబు, మహేశ్ బాబు అనే ఇద్దరు బిడ్డలు పుట్టారు.

రాజబాబు మరణం అనంతరం పెద్ద పిల్లవాడికి కేవలం 11 ఏళ్ళు మాత్రమే.చిన్నవాడికి 8 సంవత్సరాలే.

రాజబాబు సంపాదించిన డబ్బుతో అతని భార్య పిల్లల్ని పెంచి పోషించింది.ఉన్నత చదువులు చదువుకుని అమెరికాలో సాఫ్ట్ వెర్ సంస్థలను స్థాపించి వందల కోట్లకు అధిపతులయ్యారు.

ఇదిలా ఉండగా రాజబాబుకి 46 ఏళ్ల వయసులోనే గొంతు క్యాన్సర్ వచ్చింది హాస్పటల్లో జాయిన్ అయితే డాక్టర్లు రాజబాబు కి ఒక రెండు ఆప్షన్లను ఇచ్చారు.ఇతను బతకాలి అంటే గొంతు ఆపరేషన్ చేయాలి.

అది చేస్తే మనిషి ఎక్కువ కాలం జీవిస్తాడు.లేదంటే ఆయన తన సొంత గొంతుతోనే త్వరలోనే మరణిస్తాడని డాక్టర్లు చెప్పారు.

అయితే రాజా బాబు ఎంతో పెద్ద హాస్యనటుడు అనిపించుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన గొంతులో నుంచి పలికే మాటలు, హవ భావాలు, డైలాగులు, ఎదుటి వారిపై వేసే పంచులు వలన ఆయన ఇతరులను నవ్వులలో ముంచేసేవారు.తాను బతకాలి అనుకుని గొంతు ఆపరేషన్ చేయించు కున్నట్లయితే ఇక జీవితంలో రాజబాబు నటించే అవకాశం అనేది ఉండదు.

అయితే కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల ఎలాగోలా ఆయన గొంతుకు ఆపరేషన్ కూడా చేయించుకున్నారు.

Telugu Mahesh Babu, Nagendrababu, Rajababu-Telugu Stop Exclusive Top Stories

అయినాగాని ఆయన బతకలేదు సరికదా… ఉన్న గొంతు కూడా పోయింది.ఆయన చనిపోయే కొంత సమయం ముందు ఒక కాగితంపై “నేను ఎవరినీ మోసం చేయలేదు.నా బిడ్డలు, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు ఇలా అందరూ బాగుండాలి.

నా కోసం ఎవరూ ఏడవద్దు” అని కాగితం మీద రాసరట.తల్లిని పిలిచి ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పాడు.కానీ రాజబాబు వాళ్ళ అమ్మ మాత్రం రాజబాబు ని ఒంటరిగా వదిలి ఇంటికి వెళ్లడానికి ఒప్పుకోలేదు.అప్పుడు రాజబాబు అమ్మా.

నా కోసం తమ్ముడు వస్తాడు.నాతో ఈరోజు తమ్ముడు హాస్పిటల్లో తోడుగా ఉంటాడు.

నువ్వు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమని చెప్పి రాసిన కాగితాన్ని అమ్మ చేతిలో పెట్టి అమ్మని ఇంటికి పంపి చేస్తాడు.అయితే తన తమ్ముడు, భార్య పిల్లలు హాస్పిటల్ కి వచ్చే సమయాని కంటే ముందే, రాజబాబు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

అలా మన నవ్వులు పండించే రాజబాబు జీవితం అర్థంతరంగా హాస్పిటల్లోనే ముగిసిపోయింది.రాజబాబు లేరని వార్త విని సినీ ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకులు కూడా విషాదంలో మునిగిపోయారు.!!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube