జుట్టు రాలడం( Hairfall ) అనేది చాలా మందిని చాలా కామన్ గా వేధించే సమస్య.ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టు రోజు ఊడిపోతూ ఉంటే ఎంత బాధగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఈ క్రమంలోనే హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టడం కోసం సొల్యూషన్స్ వెతుకుతూ ఉంటారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ టానిక్ సూపర్ పవర్ ఫుల్ గా హెల్ప్ అవుతుంది.
ఈ టానిక్ జుట్టు రాలడాన్ని అరికట్టడంలో అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఇంతకీ ఆ న్యాచురల్ టానిక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయను( Onion ) తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ ఉల్లిపాయ జ్యూస్ లో వన్ టీ స్పూన్ కాఫీ పౌడర్( Coffee Powder ) మరియు వన్ టీ స్పూన్ హనీ( Honey ) వేసుకుని బాగా మిక్స్ చేశారంటే మన హెయిర్ టానిక్ అనేది రెడీ అవుతుంది.ఈ టానిక్ ను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి ఒకటికి రెండు సార్లు అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.
టానిక్ అప్లై చేసుకున్న గంట అనంతరం తేలికపాటి షాంపూను ఉపయోగించి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.

వారానికి ఒకసారి ఈ టానిక్ ను కనుక ఉపయోగించారంటే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు.ఉల్లిపాయ, కాఫీ పౌడర్ తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి.జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చి జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి.
అంతేకాకుండా హెయిర్ గ్రోత్ ను పెంచుతాయి.జుట్టు ఒత్తుగా పెరిగేలా ప్రోత్సహిస్తాయి.ఇక తేనె తల చర్మాన్ని తేమగా ఉంచుతుంది.చుండ్రు సమస్యను నివారిస్తుంది.జుట్టును స్మూత్ గా మార్చడమే కాకుండా కొత్త మెరుపును కూడా జోడిస్తుంది.కాబట్టి జుట్టు అధికంగా రాలిపోతుందని బాధపడుతున్న వారు తప్పకుండా పైన చెప్పిన విధంగా హెయిర్ టానిక్ తయారు చేసుకుని వాడేందుకు ప్రయత్నించండి.
మంచి రిజల్ట్ మీ సొంతం అవుతుంది.







