1.క్షమాపణలు చెప్పిన అమెరికా ప్రథమ మహిళ

లాటిన్ అమెరికా ప్రజలను టాకోలతో పోల్చినందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడన్ క్షమాపణలు చెప్పారు.
2.డల్లాస్ లో సాహితీ సదస్సు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా ) ఆధ్వర్యంలో డెట్రాయిట్ తెలుగు సాహితీ సమితి స్థానిక నోవై వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సాహితీ సదస్సును ” వెయ్యేళ్ల నన్నయ నూరేళ్ల నందమూరి ” పేరుతో నిర్వహించారు.
3.హైదరాబాద్ డాక్టర్ కి లండన్ లో అరుదైన గౌరవం

హైదరాబాద్ లోని కిమ్స్ – ఉషా లక్ష్మి సెంటర్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ డైరెక్టర్ డాక్టర్ పి రఘురాం కు లండన్ లో అరుదైన గౌరవం దక్కింది.ప్రఖ్యాత రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇంగ్లాండ్ ఆయనను గౌరవ ఫెలోషిప్ అవార్డుతో సత్కరించింది.
4.శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింగే
శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా విక్రమసింగే బాధ్యతలు స్వీకరించారు.
5.ఉద్యోగులను తొలగించి ఆఫీసు మూసివేసిన టెస్లా

టెస్లా యాజమాన్యం 229 మంది ఉద్యోగులను తొలగించింది.ఆటో పైలెట్ టీం నుంచి ఉద్యోగులను తప్పించడంతో పాటు, అమెరికాలోని ఒక ఆఫీసును కూడా మూసేసింది.
6.శ్రీలంక లో ఎమర్జెన్సీ
శ్రీలంకలో పరిస్థితి అదుపు తప్పడంతో ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది.అలాగే టీవీ ప్రసారాలు నిలిపివేశారు.
7.గూగుల్ సీఈవో సంచలన ప్రకటన

ప్రముఖ సెర్చ్ ఇంజన్ , టెక్ దిగ్గజం గూగుల్ ఫ్రెషర్ కు షాక్ ఇచ్చింది.సంస్థలో ఇకపై కొత్త ఉద్యోగాలు ఉండబోవని ప్రకటించింది.
8.తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘ధూంధాం 2022 ‘
కెనడాలోని ” తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా ” ధూమ్ ధామ్ 2022” కార్యక్రమాన్ని నిర్వహించారు.
9.ఎలెన్ మాస్క్ పై ట్విట్టర్ దావా

సోషల్ మీడియాలో అత్యంత ప్రజాదారణ పొందిన ట్విట్టర్ కొనుగోలు నుంచి టెస్లా సీఈఓ ఎల్ఎన్ మాస్క్ వెనక్కి తగ్గడం తో ఆయనపై ట్విట్టర్ దావా వేసింది.ఒక్కరోజే ట్విట్టర్ షేర్లు 11.3 శాతం తగ్గిపోయాయి.
10.పాక్ లో ఆకస్మిక వరదలు.68 మంది మృతి
పాకిస్తాన్ లో కొండపోత వర్షాలు వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అక్కడ ఆకస్మిక వరదల కారణంగా 68 మంది మరణించినట్లు అక్కడి అధికారులు తెలిపారు.