1.చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై పవన్ కళ్యాణ్ కామెంట్స్
టిడిపి అధినేత చంద్రబాబు ఆరోగ్యం పై నిర్లక్ష్యం తగదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ ప్రభుత్వ వైఖరి అమానవీయం , ఆయన ఆరోగ్య సమస్యలపై మానవతా దృక్పథంతో వ్యవహరించాలని పవన్ అన్నారు.
2.తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల
తెలంగాణ లో కాంగ్రెస్ తొలి అభ్యర్థుల జాబితా విడుదలైంది.మొత్తం 55 మంది పేర్లను ప్రకటించారు.
3.కెసిఆర్ కామెంట్స్
న్యాయపరమైన అంశాల వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానాల్లో కొన్నిచోట్ల మార్పు చేర్పులు చేయాల్సి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
4.బాలా త్రిపుర సుందరి దేవిగా దుర్గమ్మ దర్శనం
బెజవాడ దుర్గ గుడిలో దసరా సంబరాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మ ఈరోజు బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
5.కాచిగూడ, కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు
దసరా పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాచిగూడ కాకినాడ టౌన్ మధ్య ప్రత్యేక రైలు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
6.బీఆర్ఎస్ కు రాజీనామా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారం బీ ఆర్ ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారు.
7.దుర్గమ్మ సన్నిధిలో రోజా
ఏపీ మంత్రి ఆర్కే రోజా రైల్వే బెజవాడ కనకదుర్గమ్మ ను దర్శించుకున్నారు .ఈ సందర్భంగా జగనే మళ్లీ సీఎం కావాలని కోరుకున్నట్లు రోజా మీడియా కు తెలిపారు.
8. ప్రవాసాంధ్రుల పాదయాత్ర
టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సిడ్నీలోని ప్రవాసాంద్రులు పాదయాత్ర చేపట్టారు.
9.భద్రాద్రి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు
భద్రాద్రి రామాలయం ఉప ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.
10.‘బీసీ సీఎం’ హామీ ఇచ్చిన వారికే మద్దతు
తెలంగాణలో బీసీ సీఎం చేస్తామని హామీ ఇచ్చిన పార్టీకి తమ మద్దతు ఉంటుందని బీసీ సంక్షేమ సంఘం ప్రకటించింది.
11.బీ ఆర్ ఎస్ లోకి టీఎన్జీవో నేత
టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎం రాజేందర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు .ఈనెల 20న సీఎం కేసీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో ఆయన చేరనున్నారు.
12.కాంగ్రెస్ తో కలిసి సిపిఐ పోటీ
కాంగ్రెస్తో కలిసి సిపిఐ పోటీ చేయబోతుందని సిపిఐ జాతి కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి తెలిపారు.
13.పొన్నాలకు సముచిత స్థానం కల్పిస్తాం
బీఆర్ఎస్ లో పొన్నాల లక్ష్మయ్య కు సముచితకు స్థానం కల్పిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ అన్నారు.
14.రేవంత్ రెడ్డి విమర్శలు
రియల్ టర్ల తరహాలో కెసిఆర్ కుటుంబం తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు.
15.యాదాద్రి క్షేత్రంలో…
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నిత్య వీధి కైంకర్యాలు శ్రీ వైష్ణవ పాంచరాత్ర గమ శాస్త్రవేత్తలు వైభవంగా కొనసాగాయి.
16.సాగర్ నీటిమట్టం
527 అడుగుల వద్ద సాగర్ నీటిమట్టం ఉంది.
17.టికట్లు అమ్ముకుంటున్న కాంగ్రెస్
తెలంగాణలో కాంగ్రెస్ టికెట్లను బహిరంగంగా అమ్ముకుంటున్నారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
18.నేటి నుంచి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈరోజు నుంచి ప్రారంభం కానున్నాయి.
19.ప్రజావాణి రద్దు
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్ లోని సమావేశాలలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేశామని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ భారతి తెలిపారు.
20.టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేయాలి
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు రద్దుచేసి నిరుద్యోగుల్లో మనోధైర్యాన్ని కల్పించాలని అఖిలపక్ష నాయకులు 44 జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు.