స్త్రీలే కాదు పురుషులు కూడా హెయిర్ ఫాల్ ( Hair fall )కారణంగా చాలా మదన పడుతుంటారు.రోజురోజుకు జుట్టు పల్చగా మారుతుంటే తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు.
జుట్టు రాలడాన్ని ఎలా అడ్డుకోవాలో అర్థంగాక.పల్చటి జుట్టును ఒత్తుగా మార్చుకోవడం తెలియక.
తెగ వర్రీ అయిపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే క్రీమ్ మీకు అద్భుతంగా సహాయపడుతుంది.వారానికి ఒక్కసారి ఈ క్రీమ్ వాడినా చాలు ఒత్తైన జుట్టు మీ సొంతం అవుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ క్రీమ్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక ఉల్లిపాయను( Onion ) తీసుకుని శుభ్రంగా పొట్టు తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే అంగుళం అల్లం ముక్కను కూడా తీసుకొని పీల్ తీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇప్పుడు మిక్సీ జార్ లో ఉల్లి మరియు అల్లం ముక్కలు( Ginger slices ) వేసి మెత్తగా గ్రైండ్ చేసి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్( Aloe vera gel ) వేసుకోవాలి.అలాగే మూడు టేబుల్ స్పూన్లు ఉల్లి, అల్లం జ్యూస్ మరియు నాలుగు చుక్కలు టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్( Tea tree essential oil ) వేసుకుని ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేస్తే మంచి క్రీమ్ సిద్ధం అవుతుంది.
పురుషులు ఈ క్రీమ్ ను తమ స్కాల్ప్ కు అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.మసాజ్ వల్ల బ్లడ్ సర్కులేషన్ మెరుగుపడుతుంది.దాంతో హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది.

క్రీమ్ అప్లై చేసుకున్న గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ క్రీమ్ వాడినా చాలు జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.అదే సమయంలో జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
కాబట్టి ఒత్తైన జుట్టును కోరుకునే పురుషులు తప్పకుండా ఈ వండర్ ఫుల్ క్రీమ్ ను ట్రై చేయండి.







